SBI Mutual Fund : ఎస్బీఐ మ్యూచువ‌ల్ ఫండ్స్.. వామ్మో ఇంత లాభం ఉంటుందా ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

SBI Mutual Fund : ఎస్బీఐ మ్యూచువ‌ల్ ఫండ్స్.. వామ్మో ఇంత లాభం ఉంటుందా ?

 Authored By ramu | The Telugu News | Updated on :4 August 2024,4:00 pm

ప్రధానాంశాలు:

  •  SBI Mutual Fund : ఎస్బీఐ మ్యూచువ‌ల్ ఫండ్స్.. వామ్మో ఇంత లాభం ఉంటుందా ?

SBI Mutual Fund : మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టేముందు అధిక రాబడి ఇచ్చే వాటిపై అవగాహన ఉండాల్సిన అవ‌స‌రం ఎంతైన ఉంది. పెట్టుబ‌డి పెడితే లాభాలు రావాల‌ని చాలా మంది కోరుకుంటారు. అయితే ప్రతినెలా చాలా చిన్న మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తే దీర్ఘకాలంలో అత్యుత్తమ లాభాలు కొన్ని బ్యాంకుల‌లో వ‌స్తాయి. ఇటీవలి కాలంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు పరుగులు పెడుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ ఆల్ టైమ్ గరిష్ట స్థాయిల్ని తాకిన సంగతి తెలిసిందే. అయితే గడచిన రెండేళ్ల కాలంగా అనేక ప్రభుత్వ రంగ స్టాక్‌లు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్టాక్‌లు అద్భుతంగా ప‌నితీరు క‌న‌బ‌ర‌చ‌డం మ‌నం చూస్తున్నాం.

SBI Mutual Fund 3 ఏళ్లలో రూ.20 లక్షలు రాబడి..

అయితే పెట్టుబడిదారుల కోసం మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీల్‌లో పీఎస్‌యూలు, ఇన్‌ఫ్రా మ్యూచువల్ ఫండ్‌లు వ‌స్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. పుట్టుకొస్తున్నాయి ఫండ్ హౌస్ నుంచి అందుబాటులో ఉన్న ELSS ఫండ్ కూడా గత మూడు సంవత్సరాలుగా మంచి రాబడులను అందిస్తోంది. అయితే సిప్ రిట‌ర్న్‌ల ప‌రంగా చూస్తే ఫండ్ మూడేళ్లలో 58.25 శాతం సిప్ రాబడిని కలిగి ఉంది. కాబట్టి ఈ కాలంలో ఫండ్‌పై మొత్తం రాబడి 42.74 శాతంగా నమోదైంది. జనవరి 2013లో ప్రారంభమైనప్పటి నుంచి ఫండ్ 13.76 శాతం వార్షిక రాబడి రావ‌డం మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు.

SBI Mutual Fund ఎస్బీఐ మ్యూచువ‌ల్ ఫండ్స్ వామ్మో ఇంత లాభం ఉంటుందా

SBI Mutual Fund : ఎస్బీఐ మ్యూచువ‌ల్ ఫండ్స్.. వామ్మో ఇంత లాభం ఉంటుందా ?

ఇక ఫండ్ ఎస్బీఐ, గెయిల్ ఇండియా, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ సహా 26 కంపెనీల షేర్లను క‌లిగి ఉండ‌గా, నెలవారీ ఎస్ఐపీ రూపంలో రూ.27,500 సిప్ చేసిన పెట్టుబడిదారులు మూడేళ్ల కాలంలో రూ.21.65 లక్షల రాబడిని అందుకునే అవ‌కాశం ఉంటుంది. ఇక ఎస్బీఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ మూడేళ్ల కాలంలో 43.90 శాతం వార్షిక సిప్ రాబడిని అందించింది. ఆ కాలంలో పథకంపై మొత్తం రాబడి 33.25 శాతంగా ఉంది. ఈ స్కీమ్ నెలవారీ పెట్టుబడి మొత్తం మూడేళ్లలో రూ.18.18 లక్షల రాబడిని అందించింది. మార్కెట్ నిపుణులు కూడా మొదటిసారి పెట్టుబడులు పెట్టే వారికి మ్యూచువల్ ఫండ్లనే సూచిస్తుంటారు. ఈ మ్యూచువల్ ఫండ్స్‌ను నిపుణులైన ఫండ్ మేనేజర్లు నిర్వహిస్తుంటారు. తొలిసారిగా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే వారు లార్జ్ క్యాప్ ఫండ్స్‌ను సెలక్ట్ చేసుకోవడం ఉత్తమం.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది