Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్ : మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు.. మార్కెట్లో నేటి ధరలివే.!..!

Authored By Breaking News 2 | The Telugu News | Published on: January 8, 2022, 8:31 am

today gold rates బంగారం కొనేవారికి మంచి రోజులు కనిపిస్తున్నాయి. గత నాలుగు రోజులుగా తగ్గుతూ వస్తున్న పసిడి ధరల్లో నేడు మరింత మార్పు కనిపిస్తోంది. నిన్న బంగారం ధర స్వల్పంగా తగ్గగా… నేడూ భారీ మార్పు జరిగింది. ఈ భారీ తగ్గింపుతో బంగారం కొనే వారికి ఈ మేరకు నేడు కాస్త ఊరట లభించే విధంగా ఉంది. దేశవ్యాప్తంగా వివధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధర ఇలా ఉంది.ముందుగా దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46, 510 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51, 000 గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46, 510గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48, 510 గా ఉంది. ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44, 600 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48, 650 గా ఉంది.

ఏపీ లోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 44, 600 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48, 650 గా ఉంది. బంగారం ధరలు ఇలా ఉండగా నేడు వెండి ధరల్లోనూ భారీ మార్పులు వస్తున్నాయి. ఇక నేటి వెండి ధరల విషయానికొస్తే.. నిన్నటితో పోలిస్తే రూ. 900 తగ్గుదల కనిపిస్తోంది.మార్కెట్లో ప్రస్తుతం కేజీ సిల్వర్ ధర సగటకు రూ 64, 500 గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.64, 500 గా ఉండగా… ఢిల్లీ, ముంబయిలలో రూ. 60, 400 గా ఉంది. అయితే బులియన్ మార్కెట్‌లో బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు హెచ్చుతగ్గులు నమోద వుతుంటాయి.

2022 january 08 today gold rates in telugu states

2022 january 08 today gold rates in telugu states

నిమిషం నిమిషానికి.. మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతుంటాయి. భారీ మొత్తంలో కొనాలి అనుకునే వారు.. ఆ మేరకు ఎప్పటికప్పుడు ధరలను గమనిస్తూ బంగారాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.న్యూ ఇయర్ తర్వాత కొద్ది రోజులు బంగారం ధరలు నిలకడగా ఉండటమో లేదా స్వల్పంగా తగ్గడమో జరుగుతూ వచ్చింది. అయితే తాజాగా తగ్గుతున్న ధరలను బట్టి చూస్తే వచ్చే వేసవిలో పెళ్లిళ్లు ఉన్న వారు ఇప్పుడే బంగారం కొని పెట్టుకుంటే మంచిదని అంటున్నారు.

 

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp