Home » Exclusive » 2022 January 11 Today Corona Updates In India
Exclusive

Today Corona Updates : బ్రేకింగ్: విజృంభిస్తున్న కరోనా.. ఒక్కరోజే 1,68,063 కేసులు..277 మరణాలు.!

Authored By
Inesh A
The Telugu News | Updated on: January 11, 2022, 9:49 am
Advertisement

Today Corona Updates : భారత్ లో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. ఒక వైపు ఒమిక్రాన్‌ కేసులు, మరో వైపు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్త కేసుల సంఖ్య ఏకంగా 1 లక్షా 68 వేల 063 కేసులు నమోదు కాగా.. 277 మంది మరణించడం ఆందోళనకు గురిచేస్తోంది. ఇక డైలీ పాజిటివీటి రేటు 10.64 శాతంగా నమోదు చేసుకుంది. మరోవైపు రోజు వందల సంఖ్యలో ఒమిక్రాన్‌ కేసులు వెలుగు చూస్తున్నాయి.

Advertisement

ఇప్పటికే దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4, 461 కు చేరుకుంది. అధిక శాతం కేసులు మహరాష్ట్ర చూశాయి. దేశంలో ఈ కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ శరవేగంగా విస్తరిస్తూ గజ గజ లాడిస్తోంది. మూడో వేవ్ కి ఇదే ప్రారంభమని ఇప్పటికే పలువురు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఇప్పటివరకైతే ప్రమాదం కాదని కేంద్ర వైద్యారోగ్య శాఖ చెబుతోంది.

2022 january 11 today corona updates in india

Advertisement

ఒమిక్రాన్‌ భారిన పడ్డ బాధితులకు… జలుబు, జ్వరం వంటి సాధారణ ఆరోగ్య సమస్యలు ఉండి త్వరగా కోలుకుంటున్నట్లు పేర్కొంటున్నారు. అయినప్పటికీ ప్రతీ ఒక్కరూ మాస్క్, శానిటైజర్‌, భౌతికదూరం వంటి నియమాలను తప్పక పాటించాలని సూచిస్తున్నారు. ఆ మధ్య కాస్త తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. గత రెండు మూడు రోజులుగా విపరీతంగా పెరుగుతుండటం ఇప్పుడు ఆందోళనకు గురి చేస్తోంది.

Inesh A

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి