Home » Exclusive » 2022 January 13 Today Gold Rates In Telugu States
Exclusive

Today Gold Rates : స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలివే..?

Authored By
Breaking News 2
The Telugu News | Published on: January 13, 2022, 8:20 am
Advertisement

Today Gold Rates : గత వారం రోజులుగా పసిడి ప్రియులకు మంచి రోజులు నడుస్తున్నాయి. బంగారం కొనేవారికి మంచి రోజులు కనిపిస్తున్నాయి. నాలుగు రోజులుగా బంగారం ధరలు స్థిరంగా ఉండటమో లేక తగ్గుతూనో వస్తున్నాయి. నిన్న బంగారం ధర స్వల్పంగా పెరగగా… నేడు పలు ప్రాంతాల్లో స్వల్పంగా తగ్గింది. దేశవ్యాప్తంగా వివధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధర ఇలా ఉంది.ముందుగా దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46, 910 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51, 210 గా ఉంది.

Advertisement

ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46, 940 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48, 940 గా ఉంది. ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44, 800 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48, 880 గా ఉంది. ఏపీ లోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 44, 800 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48, 880 గా ఉంది.బంగారం ధరలు ఇలా ఉండగా నేడు వెండి ధరల్లో భారీ మార్పు కనిపిస్తోంది.

2022 january 13 Today Gold Rates in telugu states

Advertisement

నిన్నటితో పోలిస్తే మార్కెట్లో నేడు కేజీ సిల్వర్ ధర రూ. 3600 తగ్గింది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ. 61, 000 గా ఉంది. అయితే బులియన్ మార్కెట్‌లో బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు హెచ్చుతగ్గులు నమోద వుతుంటాయి. నిమిషం నిమిషానికి.. మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతుంటాయి. భారీ మొత్తంలో కొనాలి అనుకునే వారు.. ఆ మేరకు ఎప్పటికప్పుడు ధరలను గమనిస్తూ బంగారాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. తాజాగా స్థిరంగానో లేదా కొద్ది పాటు హెచ్చు, తగ్గు ధరలను బట్టి చూస్తే వచ్చే వేసవిలో పెళ్లిళ్లు ఉన్న వారు ఇప్పుడే బంగారం కొని పెట్టుకుంటే మంచిదని అంటున్నారు.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి