Today Gold Rates : మహిళలకు సంక్రాంతి శుభవార్త : స్థిరంగా పసిడి, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలివే..? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Today Gold Rates : మహిళలకు సంక్రాంతి శుభవార్త : స్థిరంగా పసిడి, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలివే..?

Today Gold Rates : గత వారం రోజులుగా మహిళలకు మంచి రోజులు నడుస్తున్నాయి. బంగారం కొనాలనుకునే మగువలకు మంచి రోజులు కనిపిస్తున్నాయి. నాలుగు రోజులుగా బంగారం ధరలు స్థిరంగా ఉండటమో లేక తగ్గుతూనో వస్తున్నాయి. నిన్న బంగారం ధర స్వల్పంగా పెరగగా… నేడు పలు ప్రాంతాల్లో స్వల్పంగా తగ్గి, మరికొన్ని నగరాల్లో స్థిరంగా ఉంది. దేశవ్యాప్తంగా వివధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధర ఇలా ఉంది. ముందుగా దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం […]

 Authored By kranthi | The Telugu News | Updated on :15 January 2022,8:39 am

Today Gold Rates : గత వారం రోజులుగా మహిళలకు మంచి రోజులు నడుస్తున్నాయి. బంగారం కొనాలనుకునే మగువలకు మంచి రోజులు కనిపిస్తున్నాయి. నాలుగు రోజులుగా బంగారం ధరలు స్థిరంగా ఉండటమో లేక తగ్గుతూనో వస్తున్నాయి. నిన్న బంగారం ధర స్వల్పంగా పెరగగా… నేడు పలు ప్రాంతాల్లో స్వల్పంగా తగ్గి, మరికొన్ని నగరాల్లో స్థిరంగా ఉంది. దేశవ్యాప్తంగా వివధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధర ఇలా ఉంది.

ముందుగా దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47, 150 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51, 440 గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46, 980 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48, 980 గా ఉంది. ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45, 000 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49, 100 గా ఉంది. ఏపీ లోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45, 000 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49, 100 గా ఉంది.

2022 january 15 today gold rates in telugu states

2022 january 15 today gold rates in telugu states

బంగారం ధరలు ఇలా ఉండగా నేడు వెండి ధరల్లో మార్పు కనిపిస్తోంది. నిన్నటితో పోలిస్తే మార్కెట్లో నేడు కేజీ సిల్వర్ ధర కాస్త పెరిగింది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ. 65, 910 గా ఉంది. అయితే బులియన్ మార్కెట్‌లో బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు హెచ్చుతగ్గులు నమోదవుతుంటాయి. నిమిషం నిమిషానికి.. మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతుంటాయి. భారీ మొత్తంలో కొనాలి అనుకునే వారు.. ఆ మేరకు ఎప్పటికప్పుడు ధరలను గమనిస్తూ బంగారాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. తాజాగా స్థిరంగానో లేదా కొద్ది పాటు హెచ్చు, తగ్గు ధరలను బట్టి చూస్తే వచ్చే వేసవిలో పెళ్లిళ్లు ఉన్న వారు ఇప్పుడే బంగారం కొని పెట్టుకుంటే మంచిదని అంటున్నారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది