Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్ స్థిరంగా బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలివే..?

Authored By Breaking News 2 | The Telugu News | Published on: January 17, 2022, 8:35 am

Today Gold Rates : గత వారం రోజులుగా మహిళలకు మంచి రోజులు నడుస్తున్నాయి. బంగారం కొనాలనుకునే మగువలకు మంచి రోజులు కనిపిస్తున్నాయి. నాలుగు రోజులుగా బంగారం ధరలు స్థిరంగా ఉండటమో లేక తగ్గుతూనో వస్తున్నాయి. నిన్న బంగారం ధర స్వల్పంగా పెరగగా… నేడు పలు ప్రాంతాల్లో స్వల్పంగా తగ్గి, మరికొన్ని నగరాల్లో స్థిరంగా ఉంది. దేశవ్యాప్తంగా వివధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధర ఇలా ఉంది.

ముందుగా దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47, 140 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51, 430 గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47, 090 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49, 090 గా ఉంది. ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44, 990 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49, 090 గా ఉంది. ఏపీ లోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 44, 090 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49, 090 గా ఉంది.బంగారం ధరలు ఇలా ఉండగా నేడు వెండి ధరల్లో మార్పు కనిపిస్తోంది. నిన్నటితో పోలిస్తే మార్కెట్లో నేడు కేజీ సిల్వర్ ధర భారీగా పెరిగింది .

2022 january 17 Today Gold Rates in Telugu states

2022 january 17 Today Gold Rates in Telugu states

చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ. 65. 500 గా ఉంది. అయితే బులియన్ మార్కెట్‌లో బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు హెచ్చుతగ్గులు నమోదవుతుంటాయి. నిమిషం నిమిషానికి.. మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతుంటాయి. భారీ మొత్తంలో కొనాలి అనుకునే వారు.. ఆ మేరకు ఎప్పటికప్పుడు ధరలను గమనిస్తూ బంగారాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. తాజాగా స్థిరంగానో లేదా కొద్ది పాటు హెచ్చు, తగ్గు ధరలను బట్టి చూస్తే వచ్చే వేసవిలో పెళ్లిళ్లు ఉన్న వారు ఇప్పుడే బంగారం కొని పెట్టుకుంటే మంచిదని అంటున్నారు.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp