Today Covid Update : భారత్ లో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. నేడు 2,38,018 కొవిడ్ కేసులు..!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 18 January 2022, 10:45 am

Today Covid Update : గత కొన్ని రోజులుగా రోజుకు 2 లక్షలు దాటి 3 లక్షలకు చేరువగా వెళ్లిన మహమ్మారి కరోనాకు కాస్త బ్రేక్ పడినట్లు కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా నిన్నటితో పోలిస్తే నేడు కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్త కేసుల సంఖ్య ఏకంగా 2 లక్షల 38 వేల 18 కేసులు నమోదయ్యి తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది. మహమ్మరితో తాజాగా 310 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం రికవరీ రేటు 94.09% కాగా.. మరణాల రేటు 1.29%గా ఉంది. కోవిడ్ టెస్టుల పాజిటివిటీ రేటు 14.43% శాతానికి పెరిగింది.

దేశంలో ప్రస్తుతం 17, 36, 648 యాక్టిివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు రోజు వందల సంఖ్యలో ఒమిక్రాన్‌ కేసులు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 8, 891కు చేరుకుంది. తాజాగా 1, 57, 421 మహమ్మారి నుంచి కోలుకున్నారు. అయితే దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ శరవేగంగా విస్తరిస్తూ గజ గజ లాడిస్తోంది. అయితే ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఇప్పటివరకైతే ప్రమాదం కాదని కేంద్ర వైద్యారోగ్య శాఖ చెబుతోంది.

2022 january 18 today corona updates in india

2022 january 18 today corona updates in india

ఏది ఏమైనప్పటికీ కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో పలు రాష్ట్రాలు ఇప్పటికే లాక్ డౌన్ విధించాయి. తమిళనాడు, జమ్ముకాశ్మీర్ లో వీకెండ్ లాక్ డౌన్ కొనసాగుతోంది. ప్రతీ ఆదివారం లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఏపీతో పాటు ఇంకొన్ని రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. కేసుల సంఖ్య రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉండవచ్చని భావిస్తున్నారు. ఆ మేరకు ప్రజలంతా కరోనా నిబంధనలు తప్పక పాటించాలని హెచ్చరిస్తున్నాయి.

Advertisement

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి