Today Gold Rates : మగువలకు షాకింగ్ న్యూస్.. మళ్ళీ పెరుగుతోన్న బంగారం ధరలు..!

Authored By Breaking News 2 | The Telugu News | Published on: January 22, 2022, 9:30 am

Today Gold Rates : పసిడి ప్రియులకు ఓ షాకింగ్ న్యూస్. బంగారం ధరలు మళ్ళీ పెరుగుతూ పోతున్నాయి. గత కొద్ది రోజులుగా భారీగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరల్లో మళ్ళీ క్రమక్రమంగా పెరుగుదల కనిపిస్తోంది. నిన్న బంగారం ధర స్వల్పంగా పెరగగా… నేడు పలు ప్రాంతాల్లో మళ్ళీ పెరిగింది. దేశవ్యాప్తంగా వివధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధర ఇలా ఉంది.ముందుగా దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47, 800 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52, 100 గా ఉంది.

ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47, 640 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49, 640 గా ఉంది. ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45, 650 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49, 800 గా ఉంది. ఏపీ లోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45, 650 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49, 800 గా ఉంది.బంగారం ధరలు ఇలా ఉండగా నేడు వెండి ధరల్లో మార్పు కనిపిస్తోంది. నిన్నటితో పోలిస్తే మార్కెట్లో నేడు కేజీ సిల్వర్ ధర కూడా పెరిగింది.

2022 january 22 Today Gold Rates in telugu states

2022 january 22 Today Gold Rates in telugu states

చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ. 69, 300 గా ఉంది. అయితే బులియన్ మార్కెట్‌లో బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు హెచ్చుతగ్గులు నమోదవుతుంటాయి. నిమిషం నిమిషానికి.. మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతుంటాయి. భారీ మొత్తంలో కొనాలి అనుకునే వారు.. ఆ మేరకు ఎప్పటికప్పుడు ధరలను గమనిస్తూ బంగారాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. తాజాగా స్థిరంగానో లేదా కొద్ది పాటు హెచ్చు, తగ్గు ధరలను బట్టి చూస్తే వచ్చే వేసవిలో పెళ్లిళ్లు ఉన్న వారు ఇప్పుడే బంగారం కొని పెట్టుకుంటే మంచిదని అంటున్నారు.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp