Today Gold Rates : మహిళలకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం ధరలు.. నేటి ధరలెంతో తెలుసా.!

Authored By Breaking News 2 | The Telugu News | Published on: January 23, 2022, 9:00 am

Today Gold Rates : పసిడి ప్రియులకు శుభవార్త. బంగారం కొనాలనుకునే మగువలకు మార్కెట్లో గుడ్ న్యూస్ వినిపిస్తోంది. గత కొద్దిరోజులుగా స్థిరంగా ఉంటూ వచ్చిన బంగారం ధరలు నిన్న కాస్త పెరగగా.. పలు ప్రాంతాల్లో నేడు మళ్ళీ కాస్త తగ్గాయి. నిన్న బంగారం ధర స్వల్పంగా పెరగగా… నేడు పలు ప్రాంతాల్లో స్వల్పంగా తగ్గింది. దేశవ్యాప్తంగా వివధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధర ఇలా ఉంది.ముందుగా దేశ రాజధాని ఢిల్లీలో చూసుకుంటే.. ఆభరణాల తయారీలో ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర రూ.47, 800 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52, 100 గా ఉంది.

ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47, 530 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49, 530 గా ఉంది. ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45, 500 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49, 640 గా ఉంది. ఏపీ లోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45, 590 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49, 640 గా ఉంది.బంగారం ధరలు ఇలా ఉండగా నేడు వెండి ధరల్లో మార్పు కనిపిస్తోంది. నిన్నటితో పోలిస్తే మార్కెట్లో నేడు కేజీ సిల్వర్ ధర కూడా తగ్గింది. పలు ప్రాంతాల్లో కేజీ వెండి ధర రూ. 300 తగ్గింది.

2022 january 23 today gold rates in telugu states

2022 january 23 today gold rates in telugu states

చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ. 69, 000 గా ఉంది. అయితే బులియన్ మార్కెట్‌లో బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు హెచ్చుతగ్గులు నమోదవుతుంటాయి. నిమిషం నిమిషానికి.. మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతుంటాయి. భారీ మొత్తంలో కొనాలి అనుకునే వారు.. ఆ మేరకు ఎప్పటికప్పుడు ధరలను గమనిస్తూ బంగారాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. తాజాగా స్థిరంగానో లేదా కొద్ది పాటు హెచ్చు, తగ్గు ధరలను బట్టి చూస్తే వచ్చే వేసవిలో పెళ్లిళ్లు ఉన్న వారు ఇప్పుడే బంగారం కొని పెట్టుకుంటే మంచిదని అంటున్నారు

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp