Today Covid Cases : దేశంలో కరోనా కల్లోలం.. రికార్డు స్థాయిలో మహమ్మారి కేసులు..!

Authored By Inesh A | The Telugu News | Published on: January 27, 2022, 9:30 am

Today Covid Cases : దేశంలో చాప కింద నీరులా వేగంగా ప్రవహిస్తూ వస్తున్న కరోనా మహమ్మారికి నేడు కాస్త బ్రేక్ పడింది. దేశంలో గత కొద్ది రోజులుగా 3 లక్షలకు పైగా నమోదు అవుతూ కరోనా కేసులు నిన్న భారీగా తగ్గగా.. నేడు కూడా అదే స్థాయిలో నమోదు అయ్యి కాస్త ఊరట కలిగించాయి. అయితే దేశవ్యాప్తంగా నిన్నతో పోలిస్తే నేడు కాస్త ఎక్కువ కేసులు నమోదయ్యాయి.

తాజాగా 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్త కేసుల సంఖ్య ఏకంగా 2 లక్షల 86 వేల 384 కేసులు నమోదయ్యి… మహమ్మారి ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది. డైలీ పాజిటివిటి రేటు 19. 59 శాతంగా నమోదయింది. మహమ్మరితో తాజాగా 665 మంది మృత్యువాత పడ్డారు. దేశంలో ప్రస్తుతం 22, 02, 472 యాక్టిివ్ కేసులు ఉన్నాయి. తాజాగా 3, 06, 357 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. మరోవైపు దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ శరవేగంగా విస్తరిస్తూ గజ గజ లాడిస్తోంది. రోజూ వందల సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నాయి.

2022 january 27 Covid cases in India today

2022 january 27 Covid cases in India today

తాజాగా ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. అయితే ఒమిక్రాన్ పట్ల ఇప్పటివరకైతే ప్రమాదం కాదని కేంద్ర వైద్యారోగ్య శాఖ చెబుతోంది. ఒమిక్రాన్‌ భారిన పడ్డ బాధితులకు… జలుబు, జ్వరం వంటి సాధారణ ఆరోగ్య సమస్యలు ఉండి త్వరగా కోలుకుంటున్నట్లు పేర్కొంటున్నారు. అయినప్పటికీ ప్రతీ ఒక్కరూ మాస్క్, శానిటైజర్‌, భౌతికదూరం వంటి నియమాలను తప్పక పాటించాలని సూచిస్తున్నారు.

Inesh A

No bio available for this author.

  1. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  2. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  3. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  4. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

  5. "Vijay Deverakonda Sukumar : విజయ్‌కు సుకుమార్ సినిమా పడితే కెరీర్ టర్నింగ్ పాయింటేనా? ఆరేళ్లుగా ఎదురుచూపులు!"

  6. "AP Local Body Elections : ఏపీలో కూటమి మాస్టర్ ప్లాన్.. బీసీలకు అదనపు టికెట్లు, మహిళలకు పెద్దపీట!"

  7. "Navratri Fasting Rules : నవరాత్రుల ఉపవాసం చేస్తున్నారా? పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp