Today Gold Rates : మ‌హిళ‌ల‌కు బ్యాడ్ న్యూస్‌.. మళ్ళీ పైకి ఎగబాకుతోన్న బంగారం ధరలు.. నేటి ధరలివే.! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Today Gold Rates : మ‌హిళ‌ల‌కు బ్యాడ్ న్యూస్‌.. మళ్ళీ పైకి ఎగబాకుతోన్న బంగారం ధరలు.. నేటి ధరలివే.!

Today Gold Rates : పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్. గత కొద్దిరోజులుగా భారీగా తగ్గి ఆ తర్వాత స్థిరంగా ఉంటూ వస్తున్న బంగారం ధరల్లో మళ్ళీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పలు ప్రాంతాల్లో నిన్న బంగారం ధరలు మళ్ళీ పెరగగా.. తెలుగు రాష్ట్రాల్లో నేడు మళ్ళీ కాస్త పెరిగాయి. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధర ఇలా ఉంది. ముందుగా దేశ రాజధాని ఢిల్లీలో చూసుకుంటే.. ఆభరణాల తయారీలో ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం […]

 Authored By kranthi | The Telugu News | Updated on :27 January 2022,8:33 am

Today Gold Rates : పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్. గత కొద్దిరోజులుగా భారీగా తగ్గి ఆ తర్వాత స్థిరంగా ఉంటూ వస్తున్న బంగారం ధరల్లో మళ్ళీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పలు ప్రాంతాల్లో నిన్న బంగారం ధరలు మళ్ళీ పెరగగా.. తెలుగు రాష్ట్రాల్లో నేడు మళ్ళీ కాస్త పెరిగాయి. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధర ఇలా ఉంది.

ముందుగా దేశ రాజధాని ఢిల్లీలో చూసుకుంటే.. ఆభరణాల తయారీలో ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర రూ.45, 900 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50, 100 గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45, 900 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49, 830 గా ఉంది. ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45, 900 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50, 100 గా ఉంది. ఏపీ లోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45, 900 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 50, 100 గా ఉంది.

2022 january 27 today gold rates

2022 january 27 today gold rates

బంగారం ధరలు ఇలా ఉండగా నేడు వెండి ధరల్లో కూడా మార్పు కనిపిస్తోంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ. 300 పెరిగి ప్రస్తుతం మార్కెట్ లో రూ. 68, 500 గా ఉంది. అయితే బులియన్ మార్కెట్‌లో బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు హెచ్చుతగ్గులు నమోదవుతుంటాయి. నిమిషం నిమిషానికి.. మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతుంటాయి. భారీ మొత్తంలో కొనాలి అనుకునే వారు.. ఆ మేరకు ఎప్పటికప్పుడు ధరలను గమనిస్తూ బంగారాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. తాజాగా స్థిరంగానో లేదా కొద్ది పాటు హెచ్చు, తగ్గు ధరలను బట్టి చూస్తే వచ్చే వేసవిలో పెళ్లిళ్లు ఉన్న వారు ఇప్పుడే బంగారం కొని పెట్టుకుంటే మంచిదని అంటున్నారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది