Home » Exclusive » 2022 January 28 Today Corona Updates
Exclusive

Today Corona Updates : శుభవార్త దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు..!

Authored By
Inesh A
The Telugu News | Updated on: January 28, 2022, 10:14 am
Advertisement

Today Corona Updates : దేశంలో చాప కింద నీరులా వేగంగా ప్రవహిస్తూ వస్తున్నకరోనా మహమ్మారికి నేడు కాస్త బ్రేక్ పడింది. దేశంలో గత కొద్ది రోజులుగా 2 లక్షలకు పైగా నమోదు అవుతూ కరోనా కేసులు నిన్న భారీగా తగ్గగా.. నేడు కూడా అదే స్థాయిలో నమోదు అయ్యి కాస్త ఊరట కలిగించాయి. అయితే దేశవ్యాప్తంగా నిన్నతో పోలిస్తే నేడు కాస్త తక్కువ కేసులు నమోదయ్యాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్త కేసుల సంఖ్య ఏకంగా 2 లక్షల 51 వేల 209 కేసులు నమోదయ్యి…

Advertisement

మహమ్మారి ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది. డైలీ పాజిటివిటి రేటు 15. 88 శాతంగా నమోదయింది. మహమ్మరితో తాజాగా 627 మంది మృత్యువాత పడ్డారు. దేశంలో ప్రస్తుతం 21, 05, 611 యాక్టిివ్ కేసులు ఉన్నాయి. తాజాగా 3, 47, 443 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. మరోవైపు దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ శరవేగంగా విస్తరిస్తూ గజ గజ లాడిస్తోంది. రోజూ వందల సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నాయి.

2022 january 28 today corona updates

Advertisement

తాజాగా ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. అయితే ఒమిక్రాన్ పట్ల ఇప్పటివరకైతే ప్రమాదం కాదని కేంద్ర వైద్యారోగ్య శాఖ చెబుతోంది. ఒమిక్రాన్‌ భారిన పడ్డ బాధితులకు… జలుబు, జ్వరం వంటి సాధారణ ఆరోగ్య సమస్యలు ఉండి త్వరగా కోలుకుంటున్నట్లు పేర్కొంటున్నారు. అయినప్పటికీ ప్రతీ ఒక్కరూ మాస్క్, శానిటైజర్‌, భౌతికదూరం వంటి నియమాలను తప్పక పాటించాలని సూచిస్తున్నారు.

Inesh A

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి