7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 18 నెలల డీఏ బకాయిలు ఒకేసారి 2 లక్షలు ఇచ్చి సెటిల్
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే సెవెన్త్ పే కమిషన్ ప్రకారం.. డీఏ బకాయిలను ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే.. 18 నెలల డీఏ బకాయిలను ఒకేసారి సెటిల్ మెంట్ కింద ఉద్యోగుల అకౌంట్లలో జమ చేయాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది.మీడియా సమాచారం ప్రకారం.. ప్రస్తుతం ఉన్న ఫిట్ మెంట్ 2.57 నుంచి 3.68 కి పెంచబోతున్న విషయం తెలిసిందే. ఫిట్ మెంట్ ను 3.68 శాతానికి పెంచితే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మినిమంగా ఉన్న జీతం రూ.18 వేలు కాస్త రూ.26 వేలుగా పెరగనుంది. అంటే.. ఒక్కో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి కనీసం రూ.8 వేల వరకు జీతం పెరగనుంది.
ఒకవేళ ఫిట్ మెంట్ 3.68 శాతానికి పెంచితే.. కనీస వేతనం 18 వేలు ఉంటే.. బేసిక్ వేతనం రూ.26 వేలు అవుతుంది. అంటే.. అన్ని అలవెన్సులతో కలిపి రూ.95680 అవుతుంది.జూన్ 2017నే కేంద్ర కేబినేట్ సెవెన్త్ పే కమిషన్ ను సమ్మతించిన విషయం తెలిసిందే. కాకపోతే కొన్ని కమిషన్ లో కొన్ని మార్పులు చేయాలని సూచించింది. కొత్త స్కేల్ ప్రకారం.. ఎంట్రీ లేవల్ ఉద్యోగికి బేసిక్ పే రూ.7 వేల నుంచి రూ.18 వేల వరకు ఉండనుంది. హైయెస్ట్ లేవల్ ఉద్యోగులకు సెక్రటరీ లాంటి వాళ్లకు రూ.90 వేల నుంచి రూ.2.5 లక్షల వరకు రానుంది. క్లాస్ వన్ ఉద్యోగులకు ప్రారంభ వేతనం రూ.56100 గా ఉండనుంది.

7th Pay Commission central govt employees 2 lakh as one time settlement for da arrears
7th Pay Commission : 18 నెలల బకాయిలను వన్ టైమ్ సెటిల్ మెంట్ చేస్తారా?
మరోవైపు గత 18 నెలల నుంచి పెండింగ్ లో ఉన్న డీఏ బకాయిలను ఒకేసారి సెటిల్ మెంట్ కింద 2 లక్షలు ఉద్యోగుల అకౌంట్ లో జమ చేయాలని కేంద్రం భావిస్తోంది. లేవల్ వన్ ఉద్యోగులకు అంటే రూ.11,880 నుంచి రూ.37,554 వరకు ఉన్న వాళ్లకు కనీసం రూ.1,23,100 నుంచి రూ.2,15,900 వరకు బకాయిలు రానున్నాయి. లేవల్ 14 ఉద్యోగులకు అయితే.. డీఏ బకాయిలు రూ.1,44,200 నుంచి రూ.2,18,200 వరకు రానున్నాయి.