7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ పెంపుపై కేంద్రం కీలక ప్రకటన.. భారీగా పెరగనున్న జీతాలు
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని డీఏ పెంపు కోసం ఎదురు చూస్తున్నారు. దానిపై కేంద్రం కూడా కసరత్తులు చేస్తోంది. నిజానికి.. హోలీ పండుగ సందర్భంగానే డీఏ పెరగాల్సి ఉంది కానీ.. కేంద్ర కేబినేట్ డీఏ పెంపుపై నిర్ణయం తీసుకోలేదు. ఆ తర్వాత ఉగాది సందర్భంగా కేంద్రం డీఏ పెంపుపై నిర్ణయం తీసుకుంటుందని అంతా అనుకున్నారు కానీ.. అదీ జరగలేదు. నిజానికి గత జనవరిలోనే డీఏ, డీఆర్ పెరగాల్సి ఉంది.
గత సంవత్సరం సెప్టెంబర్ లో డీఏ 38 శాతానికి పెరిగింది. ఆ తర్వాత జనవరిలో పెరగాలి కానీ.. పెరగలేదు.ఈసారి మరో 4 శాతం పెంచి.. 42 శాతానికి డీఏ రానున్నదని వార్తలు వస్తున్నాయి. డీఏతో పాటు ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ పై కూడా కేంద్రం నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. మార్చి 31 లోపు డీఏ పెంపు, ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. డీఏ లెక్కింపును కేంద్రం.. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ప్రకారం లెక్కిస్తుంది.
7th Pay Commission : కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ప్రకారం పెరగనున్న డీఏ
దాని ప్రకారమే డీఏను పెంచుతుంది. ఈసారి సీపీఐ ఐడబ్ల్యూ ఇండెక్స్ ప్రకారం 4 శాతం డీఏను పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. డీఆర్ కూడా 4 శాతమే పెరిగే అవకాశం ఉంది. మార్చిలో డీఏ పెరిగినా.. అది జనవరి 1, 2023 నుంచి అమలులోకి వస్తుంది. డీఏ 42 శాతానికి పెరిగితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా భారీగానే పెరగనున్నాయి. లేవల్ వన్ గ్రేడ్ పే ప్రకారం.. బేసిక్ శాలరీ రూ.15 వేలు ఉంటే..42 శాతం డీఏ లెక్క ప్రకారం రూ.6300 డీఏ పెరగనుంది.