7th pay commission : ఉద్యోగులకు మరో తీపి కబురు అందించిన కేంద్రం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

7th pay commission : ఉద్యోగులకు మరో తీపి కబురు అందించిన కేంద్రం..!

 Authored By ramu | The Telugu News | Updated on :5 April 2025,12:00 pm

ప్రధానాంశాలు:

  •  7th pay commission : ఉద్యోగులకు మరో తీపి కబురు అందించిన కేంద్రం..!

7th pay commission : కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త అందించింది. తాజాగా కేంద్ర క్యాబినెట్‌ సమావేశంలో 2% డీఏ (డియర్‌నెస్ అలవెన్స్), డీఆర్ (డియర్‌నెస్ రిలీఫ్) పెంపును ఆమోదించింది. 2025 జనవరి 1 నుండి ఈ పెంపు అమల్లోకి రానుంది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా సుమారు 48.6 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 66.5 లక్షల పెన్షనర్లకు లాభం కలగనుంది. ముఖ్యంగా కనీస బేసిక్ జీతం రూ.18,000 ఉన్న ఉద్యోగులకు నెలకు రూ.360, పెన్షనర్లకు రూ.180 అదనంగా అందనుండటంతో ఇది వారికే కాకుండా, వారి కుటుంబాలకు కూడా ఆర్థిక భరోసాను అందజేస్తుంది…..

7th Pay Commission

7th Pay Commission

7th pay commission : ఉద్యోగులకి గుడ్ న్యూస్.. డీఏ పెంపుపై ప్రభుత్వం మరోసారి కీలక ప్రకటన

పెరిగిన డీఏను 2025 ఏప్రిల్‌ నెల జీతంతో పాటు చెల్లించనున్నారు. అదనంగా జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల డీఏ పెంపుకు సంబంధించిన బకాయిలను (అరియర్స్) కూడా ఒక్కసారిగా చెల్లించనున్నారు. ఉదాహరణకు కనీస బేసిక్ సాలరీ కలిగిన ఉద్యోగులకు మూడు నెలలకి కలిపి రూ.1,080 వరకు బకాయిలు అందే అవకాశముంది. పెన్షనర్లకు కూడా తగిన మేరకు అదనపు పెన్షన్ లభించనుంది. అయితే ఈ పెంపుతో ప్రభుత్వ ఖజానాపై ఏడాదికి సుమారు రూ.6,614.04 కోట్ల భారం పడే అవకాశం ఉంది.

భవిష్యత్తులో డీఏ పెంపు ఇంకా కొనసాగనుంది. 2025 జూలై-డిసెంబర్ కాలానికి సంబంధించి డీఏ సవరింపు ప్రకటన 2025 అక్టోబర్ లేదా నవంబర్‌లో వెలువడే అవకాశం ఉంది. మరోవైపు, 8వ పే కమిషన్ అమలయ్యే సమయంలో డీఏను బేసిక్ సాలరీలో కలిపి మళ్లీ కొత్త జీతపు స్ట్రక్చర్ రూపొందించనున్నారు. పెరిగిన డీఏ క్రెడిట్ అయ్యిందా లేదా తెలుసుకోవాలంటే ఉద్యోగులు తమ జీత స్లిప్, బ్యాంక్ స్టేట్‌మెంట్ లేదా ఆన్‌లైన్ ఎంప్లాయీ పోర్టల్స్‌ను చెక్ చేసుకోవచ్చు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది