7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ పెంపుపై ప్రకటన.. ఎప్పుడంటే?
7th Pay Commission : ఎప్పుడెప్పుడా అని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. డీఏ పెంపు కోసం. డీఏ పెంపుతో పాటు డీఏ బకాయిలు, ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ గురించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. హోలీ సందర్భంగా త్రిబుల్ ధమాకాను ఉద్యోగులకు కేంద్రం ఇస్తుందని అంతా అనుకున్నారు. కానీ హోలీ ముగిసింది కానీ.. ఇంకా డీఏ పెంపుపై కేంద్రం ఎలాంటి ప్రకటన చేయలేదు.
హోలీ తర్వాత మే 8న కేబినేట్ భేటీ తర్వాత ప్రకటన ఉంటుంది అనుకున్నారు. కానీ.. ప్రకటన అయితే వెలువడలేదు. డీఏ ప్రస్తుతం 38 శాతం ఉంది. దాన్ని 42 శాతంగా చేసి 4 శాతం డీఏను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 42 శాతం డీఏ పెరిగితే.. జీతాలు కూడా భారీగా పెరగనున్నాయి. ప్రస్తుతం ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ 2.57 శాతంగా ఉంది. ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ ను కూడా పెంచాలని ఉద్యోగులు అడుగుతున్నారు.
7th Pay Commission : తాజా సీపీఐ ప్రకారం పెరగనున్న డీఏ
ప్రస్తుతం కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఎంత ఉంది అనే దానిపై ఆధారపడి డీఏను పెంచనున్నారు. జనవరి 31, 2023న సీపీఐ రిలీజ్ అయింది. దాని ప్రకారం డీఏ 4.23 శాతంగా పెరగాలి. కానీ.. డీఏ పెంపును 4 శాతం చేసే అవకాశం ఉంది. హోలీ ముగిసినా త్వరలో ఉగాది ఉన్నందున ఉగాది కానుకగా డీఏ పెంపుపై కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. డీఏ ఇప్పుడు పెరిగినా.. జనవరి 1, 2023 నుంచి అమలులోకి రానుంది. అంటే మూడు నెలల బకాయిలను కూడా 42 శాతం డీఏగా లెక్కించి ఉద్యోగుల ఖాతాల్లో కేంద్రం జమచేయనుంది.