7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మరోసారి పెరగనున్న డీఏ.. భారీగా పెరగనున్న జీతాలు.. ఎంతో తెలుసా?
7th Pay Commission : గత నెలలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. మరోసారి గుడ్ న్యూస్ చెప్పేందుకు రెడీ అవుతోంది. జనవరిలో పెరగాల్సిన డీఏ గత నెలలో పెరిగిన విషయం తెలిసిందే. జనవరి 1, 2023 నుంచి డీఏ పెంపు అమలులోకి వస్తుందని కేంద్రం తెలిపింది. ఏడో వేతన సంఘం సిఫారసుల మేరకు డీఏను 4 శాతం పెంచింది. అయితే.. మరోసారి అంటే వచ్చే జులైలో డీఏను మరోసారి పెంచేందుకు కేంద్రం సమాయత్తమవుతున్నట్టు తెలుస్తోంది.
జులైలో మరో 4 శాతం డీఏ పెంచే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. నిజానికి ప్రతి సంవత్సరం జనవరి, జులైలో డీఏ పెరుగుతుంది. జనవరిలో పెరగాల్సిన డీఏ.. గత నెల పెరిగింది. మళ్లీ జులైలో పెరిగే అవకాశం ఉంది. డీఏ, డీఆర్ రెండూ పెరిగే అవకాశాలు ఉన్నాయట. దీని వల్ల ప్రస్తుతం 42 శాతంగా ఉన్న డీఏ మరో 4 శాతం పెరిగితే అది 46 శాతం కానుంది. దీని వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఒక్కసారిగా పెరగనున్నాయి.
7th Pay Commission : డీఏ పెంపు వల్ల 50 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి
డీఏ పెంపు వల్ల దేశవ్యాప్తంగా పనిచేస్తున్న సుమారు 47.58 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. అలాగే.. 69.76 లక్షల పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. ఉద్యోగుల బేసిక్ పే ప్రకారం డీఏ పెరగనుంది. ప్రస్తుతం ఉన్న ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకొని డీఏను కేంద్రం పెంచుతుంది. గత సంవత్సరం సెప్టెంబర్ 28, 2022న కేంద్రం డీఏను పెంచింది. ఆ తర్వాత మళ్లీ గత నెలలో జనవరి డీఏను పెంచి జనవరి 1 నుంచి డీఏను అమలులోకి తీసుకొచ్చింది. మళ్లీ జులైలో ఏడో వేతన సంఘం సిఫారసు మేరకు డీఏను పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.