7th Pay Commission
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకి గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల 7వ వేతన సంఘం సూచనల మేరకు డియర్‌నెస్ అలవెన్స్ , డియర్‌నెస్ రిలీఫ్ లను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ, డీఆర్‌లను 3 శాతం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ), పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ (డీఆర్) అడిషనల్ ఇన్‌స్టాల్‌మెంట్లను అందించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2022 జనవరి 1వ తేదీ నుంచి బేసిక్ పే/పెన్షన్‌లో ప్రస్తుతం ఉన్న 31 శాతం రేటు కంటే 3 శాతం పెరుగుదల అమలవుతుంది అని పేర్కొంది. ఈ క్రమంలో రైల్వే కార్మికుల జీతం పెరగనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
వాస్తవానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్‌ను పెంచిన తర్వాత రైల్వే మంత్రిత్వ శాఖ కూడా ఈ భత్యాన్ని చెల్లించాలని అన్ని జోన్లకి ఆదేశాలు జారీచేసింది. దీనిప్రకారం.. సవరించిన రేట్లతో డియర్‌నెస్ అలవెన్స్ చెల్లిస్తారు. రైల్వేశాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో దాదాపు 14 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు నేరుగా లబ్ధి పొందనున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెలాఖరులోగా ఈ చెల్లింపులు జరుగుతాయి. రైల్వే బోర్డు డిప్యూటీ డైరెక్టర్ జై కుమార్ ఈ మేరకు అన్ని జోన్లు, ఉత్పత్తి యూనిట్లకు లేఖ జారీ చేశారు. ఇందులో ‘రైల్వే ఉద్యోగులకు చెల్లించాల్సిన డియర్‌నెస్ అలవెన్స్‌ను జనవరి 1, 2022 నుంచి అమలులోకి వచ్చేలా బేసిక్ పేలో ప్రస్తుతం ఉన్న 31% నుంచి 34%కి పెంచుతామనిపేర్కొన్నారు.
7th Pay Commission Railways Employees Likely to Get Hike in DA Soon
ఏప్రిల్ 30న బకాయిలతో పాటు డియర్‌నెస్ అలవెన్స్ కూడా చెల్లిస్తామని గోపాల్ మిశ్రా తెలిపారు. 7వ వేతన సంఘం సిఫార్సులు ఆధారంగా డీఏ అమలు జనవరి 1, 2022 అమల్లోకి రానుంది. ధరల పెరుగుదల నేపథ్యంలో బేసిక్ పే/పెన్షన్‌కు అదనంగా 3 శాతం డీఏ పెంపును వేతన సంఘం సిఫార్సు చేసింది. తాజా నిర్ణయంతో రైల్వే ఉద్యోగులు తాజా నిర్ణయం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.