8th Pay Commission | 2027లో అమలులోకి 8వ వేతన సంఘం .. కేంద్ర ఉద్యోగులకు భారీ ఊరట రానుందా?
8th Pay Commission | దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న 8వ కేంద్ర వేతన సంఘం (8th Pay Commission) అమలుపై కీలక అభిప్రాయాలు వెలువడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు దీనిపై అధికారిక ప్రకటన చేయకపోయినా, జాతీయ మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం వేతన సంఘం ఏర్పాటుకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. అయితే వాస్తవికంగా జీతాల పెంపు 2027 జులైలో అమలులోకి వచ్చే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది.
#image_title
ఏమంటున్నారు నిపుణులు?
7వ వేతన సంఘం మాదిరిగానే, 8వ వేతన సంఘం ఏర్పాటయిన తర్వాత నివేదిక తయారీకి 12–18 నెలల సమయం పడే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ 2025లో ప్రారంభమైతే, 2027 మధ్య నాటికి అమలు సాధ్యమవుతుంది. దీంతో 2026 జనవరి నుంచి వేతన సవరణ బకాయిలు చెల్లించే అవకాశం ఉంది. ఈ క్రమంలో సుమారు 18 నెలల బకాయిలు ఉద్యోగులకు లభించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఎంత వరకు జీతాలు పెరగొచ్చు?
ప్రస్తుతం ఉన్న ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 నుండి
3.0 – 3.2 వరకు పెరిగే అవకాశముంది
దీని ఆధారంగా జీతాలు సుమారు 20–25% వరకు పెరగొచ్చని భావిస్తున్నారు.
ద్రవ్యోల్బణం, డీఏ రేట్లు, ఆర్థిక పరిస్థితి వంటి అంశాలపై ఇది ఆధారపడి ఉంటుంది.