KCR Birthday : కేసీఆర్ పుట్టిన రోజున… 600 ఏళ్ల నాటి యాగాన్ని నిర్వహిస్తున్నారు
KCR Birthday : ఫిబ్రవరి 17 వచ్చిందంటే చాలు.. తెలంగాణలో ఎక్కడ చూసినా పండుగ వాతావరణమే. దానికి కారణం.. ఆరోజు సీఎం కేసీఆర్ బర్త్ డే. కేసీఆర్ పై ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఎంత వ్యతిరేకత ఉన్నా… తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా కేసీఆర్ పై ఎక్కడో కొంచెం అయినా తెలంగాణ ప్రజలకు అభిమానం ఉంటుంది. అందుకే.. కేసీఆర్ ఇంకా తెలంగాణకు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.

aadi sravana yagam to be conducted on cm kcr birthday
అయితే.. కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా.. ఫిబ్రవరి 17న హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో ప్రత్యేక యాగాన్ని నిర్వహిస్తున్నారు టీఆర్ఎస్ శ్రేణులు. దాని పేరు అధి శ్రవణ యాగం. ఇది ఇప్పటిది కాదు. అసలు.. ఇప్పటి వరకు తెలంగాణలో దాన్ని నిర్వహించలేదు. ఆ యాగం సుమారు 600 ఏళ్ల నాటిది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ, టీఆర్ఎస్ నేతల ఆధ్వర్యంలో ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారు.
KCR Birthday : 600 ఏళ్ల నాటి కేరళకు చెందిన యాగం ఇది
ఈ యాగాన్ని 600 సంవత్సరాలకు పూర్వం కేరళలో నిర్వహించేవారు. అది కూడా నంబూద్రి బ్రాహ్మణులు మాత్రమే ఈ యాగాన్ని నిర్వహించేవారు. ఆ తర్వాత ఈ యాగాన్ని నిర్వహించలేదు. తాజాగా తెలంగాణలో ఈ యాగాన్ని నిర్వహించబోతున్నారు.
రాష్ట్రంలో ఎటువంటి సమస్యలు రాకుండా ఉండేందుకు, ప్రకృతి వైపరీత్యాలు రాకుండా ఉండేందుకు, అగ్ని సమస్యలు రాకుండా ఉండేందుకు ఈ యాగాన్ని తెలంగాణలో సీఎం కేసీఆర్ పుట్టిన రోజున నిర్వహిస్తున్నారు. ఈ యాగంలో పాల్గొనాలనుకునే భక్తులు.. హిందూ సంప్రదాయం ప్రకారం దుస్తులు ధరించి వెళ్లాల్సి ఉంటుంది.
ఫిబ్రవరి 17న ఉదయం.. 6 గంటలకే యాగం ప్రారంభం అవుతుంది. ఇప్పటికే యాగానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు యాగం జరుగుతుంది. అయితే.. ఈ యాగంలో పాల్గొనేందుకు.. తెలంగాణ వ్యాప్తంగా చాలామంది భక్తులు తమ పేర్లను నమోదు చేసుకున్నట్టు తెలుస్తోంది.