Kavitha Arrest : ఒకవేళ గనక డిల్లీలో కవితని అరస్ట్ చేస్తే.. కెసిఆర్ తీయబోయే నెక్స్ట్ అస్త్రం ఇదే !
Kavitha Arrest : ఇదిగో అరెస్ట్.. అదిగో అరెస్ట్ అంటూ తెలంగాణ ఎమ్మెల్సీ కవిత గురించి వార్తలు రోజురోజుకూ ఒక్కో విధంగా వస్తున్నాయి. అసలు కవితను అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేస్తే కేసీఆర్ ఊరుకుంటారా? అనేదే పెద్ద ప్రశ్న. నిజానికి తనకి సన్నిహితులు అయిన అరుణ్ పిళ్లైని ఇటీవలే అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు. ఒకవేళ ఆయన కవిత గురించి ఏదైనా నోరు విప్పితే ఇక తన అరెస్ట్ ఖాయం అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో ఏం చేయాలి? ఒకవేళ సడెన్ గా కవితను అరెస్ట్ చేస్తే తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ పలువురు నేతలతో చర్చిస్తున్నారట.
దానిపైనే బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే.. పార్లమెంటరీతో పాటు లెజిస్లేటివ్, రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని కూడా అందరితో కలిపి జరపాలని నిర్ణయిస్తున్నట్టు తెలుస్తోంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలంతా ఈ సమావేశానికి హాజరుకానున్నారట. కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడంతో ఆమె అరెస్ట్ అవుతారని వార్తలు వస్తున్న నేపథ్యంలో శుక్రవారమే ఈ సమావేశాన్ని నిర్వహించాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. నిజానికి.. మరోసారి విచారణకు హాజరుకావాలంటూ కవితను ఈడీ అధికారులు ఢిల్లీకి పిలిచారు.
Kavitha Arrest : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నేతలంతా హాజరు
దీంతో కవిత ఢిల్లీకి వెళ్లారు. విచారణ కాగానే ఆమెను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ కవితను అరెస్ట్ చేస్తే వెంటనే బీఆర్ఎస్ పార్టీ తరుపున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి పిలుపునిచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అదే విషయాన్ని సమావేశంలోనూ చర్చించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా స్థాయిలో బీఆర్ఎస్ శ్రేణులంతా అప్రమత్తమయి.. కావాలని బీజేపీ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీపై కక్షసాధింపు చర్యలు చేపడుతోందని.. బీజేపీ విధానాలను ఎండగట్టేలా ఉద్యమించాలని సీఎం కేసీఆర్ పిలుపు ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. చూద్దాం మరి.. ఏం జరుగుతుందో.