Akira Nandan | ఓజీ’లో అకిరా నందన్ ఉన్నాడా?… గేమ్‌లోని ఓ సీన్‌పై ఫ్యాన్స్ గెస్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Akira Nandan | ఓజీ’లో అకిరా నందన్ ఉన్నాడా?… గేమ్‌లోని ఓ సీన్‌పై ఫ్యాన్స్ గెస్..!

 Authored By sandeep | The Telugu News | Updated on :23 September 2025,4:00 pm

Akira Nandan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన‌ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఓజీ’ సెప్టెంబర్ 25న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే ట్రైలర్, సాంగ్స్‌తో భారీ బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమాపై ఫ్యాన్స్ బోలెడ‌న్ని ఆశ‌లు పెట్టుకున్నారు ఇక ఇప్పుడు మరో ఆసక్తికరమైన గాసిప్ ఫ్యాన్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అదేంటంటే… పవన్ కుమారుడు అకిరా నందన్ కూడా ఈ సినిమాలో ఉన్నాడా అని?

#image_title

నిజ‌మెంత‌?

ఓజీ ఫస్ట్ సాంగ్‌ విడుదలైనప్పటి నుంచే కొన్ని విజువల్స్, డిజైన్ డీటెయిల్స్ లో యంగ్ కుర్రాడు కనిపించాడని, అతడి కళ్లపై ఫోకస్‌ వేయడం వంటివి చూసి ఫ్యాన్స్ అతడు అకిరానే అయి ఉండొచ్చని ఊహించుకుంటున్నారు. దీనికి మరింత బలం చేకూర్చిన విషయం ఏమిటంటే… తాజాగా ఆన్లైన్‌లో ఓజీ ఆధారంగా రూపొందించిన ఓ వీడియో గేమ్‌లో ఓ ప్రత్యేక సీన్ వైరల్ అవుతోంది.

ఆ గేమ్‌లో ఓ కత్తిలో ప్రతిబింబంగా ఓ యువకుడి కళ్ల విజువల్ క‌నిపిస్తుంది.. ఆ కళ్ళు పవన్ కళ్యాణ్‌కు సంబంధించినవి కాకపోయినా, ఓ క్లోస్ లుక్ వేస్తే అవి అకిరా కళ్ళలా ఉన్నాయనే అభిప్రాయాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. దీంతో అకిరా ఈ సినిమాలో గెస్ట్ రోల్‌లో అయినా ఉండొచ్చన్న టాక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.అకిరా పాత్రపై చిత్రబృందం ఎలాంటి క్లారిటీ ఇవ్వనప్పటికీ, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్‌ను ఊహించేలా హింట్లు వస్తుండటంతో ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. అయితే ఈ వార్తల్లో నిజమెంత? అకిరా నిజంగానే ‘ఓజీ’లో కనిపించనున్నాడా? అన్నది సినిమా రిలీజ్ అయితే కాని తెలియ‌దు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది