గర్వంగా ఉంది వరుణ్.. బన్నీ ప్రశంసలకు కారణం తెలిస్తే షాక్!! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

గర్వంగా ఉంది వరుణ్.. బన్నీ ప్రశంసలకు కారణం తెలిస్తే షాక్!!

మెగా డాటర్ నిహారిక పెళ్లి పనులన్నీ కూడా వరుణ్ తేజ్ చూసుకుంటున్నాడని నాగబాబు ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే నిహారిక పెళ్లి అరేంజ్మెంట్స్ చూసిన ప్రతీ ఒక్కరూ ముక్కున వేలేసుకుంటున్నారు. యువరాణికి పెళ్లి జరిగితే ఎలాంటి సందడి ఉంటుంది.. ఏ రేంజ్‌లో ఉంటుందో వరుణ్ తేజ్ చూపించాడు. ఇదే విషయాన్ని బన్నీ కూడా చెబుతూ వరుణ్ తేజ్‌ను ప్రశంసలతో ముంచెత్తాడు. నిహారిక పెళ్లి వేడుకల్లో అల్లు ఫ్యామిలీ ఎంతగా […]

 Authored By uday | The Telugu News | Updated on :9 December 2020,7:50 am

మెగా డాటర్ నిహారిక పెళ్లి పనులన్నీ కూడా వరుణ్ తేజ్ చూసుకుంటున్నాడని నాగబాబు ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే నిహారిక పెళ్లి అరేంజ్మెంట్స్ చూసిన ప్రతీ ఒక్కరూ ముక్కున వేలేసుకుంటున్నారు. యువరాణికి పెళ్లి జరిగితే ఎలాంటి సందడి ఉంటుంది.. ఏ రేంజ్‌లో ఉంటుందో వరుణ్ తేజ్ చూపించాడు. ఇదే విషయాన్ని బన్నీ కూడా చెబుతూ వరుణ్ తేజ్‌ను ప్రశంసలతో ముంచెత్తాడు.

Allu Arjun Praises Varun Tej For Niharika Wedding Arrangements

Allu Arjun Praises Varun Tej For Niharika Wedding Arrangements

నిహారిక పెళ్లి వేడుకల్లో అల్లు ఫ్యామిలీ ఎంతగా రచ్చ చేస్తోందో అందరికీ తెలిసిందే. అల్లు ఫ్యామిలీ బ్రాండ్ కనిపించేలా మెగా ఈవెంట్‌లో దుమ్ములేపుతున్నారో. అల్లు అర్జున్ షేర్ చేసే ఫోటోలు, ఆ స్టైల్, ఆ స్వాగ్ చూసి అందరూ ఫిదా అవుతున్నారు. తాజాగా బన్నీ వరుణ్ తేజ్‌తో దిగిన ఫోటోను షేర్ చేశాడు. ట్విన్నింగ్ విత్ బ్రదర్ అంటూ వరుణ్‌ తేజ్ మీద ప్రేమను కురిపించాడు. ఇక పెళ్లి పనులపై స్పందిస్తూ.. వరుణ్ తేజ్‌ను ప్రశంసలు కురిపించాడు.

చెల్లి పెళ్లి వేడుకలను అత్యున్నతంగా నిర్వహించాడు.. ఇంత గొప్పగా అరేంజ్మెంట్స్ చేసినందుకు ఎంతో గర్వంగా ఉంది బ్రదర్.. నీకు అంతులేని ప్రేమ అంటూ బన్నీ కామెంట్ చేశాడు. నిహారిక పెళ్లి పనుల్లో బిజీగా ఉండటం మూలానే వరుణ్ తేజ్ తన కొత్త సినిమాను ప్రారంభించలేదని తెలుస్తోంది. మొత్తానికి నిహారిక పెళ్లి వేడుకల్లో మాత్రం వరుణ్ తేజ్ హైలెట్ అయ్యేలానే కనిపిస్తున్నాడు. ఆ వేడుకలను చూస్తుంటే అందరి కళ్లు తిరిగిపోయేలా ఉన్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో నిహారిక పెళ్లి హాట్ టాపిక్ అవుతోంది.

uday

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది