Allu Arjun : ఇది క‌దా అల్లు అర్జున్ అంటే.. టార్గెట్ చేసిన చేతులతోనే అవార్డు ఇప్పించుకున్నాడు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Allu Arjun : ఇది క‌దా అల్లు అర్జున్ అంటే.. టార్గెట్ చేసిన చేతులతోనే అవార్డు ఇప్పించుకున్నాడు

 Authored By ramu | The Telugu News | Updated on :15 June 2025,1:30 pm

Allu Arjun : జూన్ 14న గ‌ద్ద‌ర్ అవార్డ్‌ల ప్రదానోత్సవం ఘనంగా జ‌ర‌గ‌గా, ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి- హీరో అల్లు అర్జున్‌లు హైలైట్‌గా నిలిచారు. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ సంథ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనలో ఓ వివాహిత చనిపోగా.. ఆమె కుమారుడు చావు అంచుల దాకా వెళ్లొచ్చాడు. ఈ దుర్ఘటనపై హీరో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారు.

Allu Arjun : ఇది క‌దా బ‌న్నీ అంటే..

బెయిల్‌పై విడుదలైన వెంటనే అల్లు అర్జున్ ఇంటికి టాలీవుడ్ మొత్తం క్యూకట్టడం, ప్రభుత్వంపై బన్నీ విమర్శలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. తల్లి ప్రాణాలు కోల్పోయి అక్కడ పడిఉంటే థియేటర్‌లోనే ఉన్న హీరో కనీసం ఏం జరిగిందనే పట్టించుకోకుండా వెళ్లిపోయాడని రేవంత్ రెడ్డి అసెంబ్లీలోనే ఫైర్ అయ్యారు. అల్లు అర్జున్‌ను పరామర్శించడానికి వెళ్లిన సెలబ్రెటీలలో ఒక్కరు కూడా చనిపోయిన రేవతిని కానీ, ఆసుపత్రిలో ఉన్న ఆమె కుమారుడిని గానీ పరామర్శించారా? అని సీఎం ప్రశ్నించారు.

Allu Arjun ఇది క‌దా అల్లు అర్జున్ అంటే టార్గెట్ చేసిన చేతులతోనే అవార్డు ఇప్పించుకున్నాడు

Allu Arjun : ఇది క‌దా అల్లు అర్జున్ అంటే.. టార్గెట్ చేసిన చేతులతోనే అవార్డు ఇప్పించుకున్నాడు

ఈ పరిణామాలతో అల్లు అర్జున్ – రేవంత్ రెడ్డి మధ్య గ్యాప్ వచ్చింది. ఇక తెలంగాణ గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం వేడుకలలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అల్లు అర్జున్, బాలకృష్ణ, విజయ్ దేవరకొండ హాజరయ్యారు. గద్దర్ అవార్డ్స్ కార్యక్రమంలో రేవంత్ అక్కడ ఉన్నవారిని పలకరిస్తుూ బాలకృష్ణతోపాటు అల్లు అర్జున్ ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఇక బన్నీకి తన చేతుల మీదుగా అవార్డ్ అందించారు. టార్గెట్ చేసిన చేతులతోనే అవార్డు ఇప్పించుకున్న బ‌న్నీ.. వార్నింగ్ ఇచ్చిన వారి ముందే కాలర్ ఎగరేసి మరీ డైలాగ్ చెప్పాడు అంటూ నెటిజ‌న్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది