Cardamom Tea | యాలకుల టీ ఆరోగ్యానికి సూపర్ బూస్టర్.. వైద్య నిపుణులు ఏమంటున్నారంటే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Cardamom Tea | యాలకుల టీ ఆరోగ్యానికి సూపర్ బూస్టర్.. వైద్య నిపుణులు ఏమంటున్నారంటే..!

 Authored By sandeep | The Telugu News | Updated on :5 October 2025,10:30 am

Cardamom Tea | తాజాగా ఆరోగ్య నిపుణులు సూచిస్తున్న మార్గాల్లో ఒకటి టీలో యాలకులు వేయడం. ఇది కేవలం రుచికి మాత్రమే కాదు, శరీరానికి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుంది. యాలకులు టీలో వేయడం వల్ల జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తి ప్రేరేపించబడుతుంది. కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి. కాలేయం, మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుంది. అంతేకాకుండా, యాలకుల టీని తరచుగా తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన విషపదార్థాలు బయటకు వెళ్ళి, మెటబాలిజం రేటు పెరుగుతుంది. ఫలితంగా బరువు అదుపులో ఉంటుంది.

#image_title

రోగనిరోధక శక్తి & మానసిక స్థితి

యాలకులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. టీలో యాలకులు వేయడం ద్వారా ఆక్సీకరణ ఒత్తిడి తగ్గి, ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడుతుంది. ఇవి మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తాయి. సెరోటోనిన్ మరియు ఇతర మంచి అనుభూతిని కలిగించే హార్మోన్ల ఉత్పత్తి ప్రేరేపించి, ఒత్తిడిని తగ్గిస్తుంది.

షుగర్ & రక్తపోటు నియంత్రణ

యాలకులు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి. దీని వల్ల రక్తంలోని షుగర్ స్థాయిలు అదుపులో ఉంటాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు షుగర్ నియంత్రణలో సహాయపడతాయి.

నోటి, శ్వాసకోశ & గుండె ఆరోగ్యం

యాలకులలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు నోటి దుర్వాసన తగ్గిస్తాయి. సినోల్ పదార్థం శ్వాసకోశ సమస్యలతో పాటు నోటి ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. దగ్గు, ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి సమస్యల్లో సహాయం చేస్తుంది.

గుండె & రక్తపోటు

యాలకులు రక్తప్రసరణను మెరుగుపరుస్తూ, చెడు కొలెస్ట్రాల్ తగ్గించి, హైబీపీ నియంత్రణలో సహాయపడతాయి.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది