ఈ మొక్క కనిపిస్తే అస్సలు వదలకండి… ప్రతి చోట కనిపించే మొక్కే కానీ.. ఇది ఎంత విలువైందో మనకు తెలియదు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

ఈ మొక్క కనిపిస్తే అస్సలు వదలకండి… ప్రతి చోట కనిపించే మొక్కే కానీ.. ఇది ఎంత విలువైందో మనకు తెలియదు

 Authored By jagadesh | The Telugu News | Updated on :1 April 2021,8:50 pm

health benefits : మీకు దువ్వెన బెండ చెట్టు తెలుసా? పోనీ ముద్ర బెండ చెట్టు. అతి బల చెట్టు తెలుసా? లేదంటే తుత్తురు బెండ, దువ్వెన కాయలు అయినా చూశారా ఎప్పుడైనా? మీది పల్లెటూరు అయితే.. పొలం, చెలకకు వెళ్లేటప్పుడు అయినా… మీ ఇంటి చుట్టుపక్కల అయినా సరే… ఈ చెట్టును చూసే ఉంటారు. ఆ చెట్టుకు ఉండే పువ్వులు గుండ్రగా టైర్ లా ఉంటాయి. వాటితో మీరు ఆటలు ఆడుకొని కూడా ఉంటారు. వాటితో దువ్వెనలా మీ జుట్టును కూడా దువ్వుకొని ఉంటారు కానీ.. ఆ చెట్టు బంగారం అని… ఆ చెట్టు వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు నయం అవుతాయని.. ఆ చెట్టు ఒక్కటి ఉంటే చాలు… జీవితాంతం ఎటువంటి వ్యాధి రాకుండా జాగ్రత్త పడొచ్చని… ఆ మొక్కలో ఉన్న ఔషధ గుణాలు మరే చెట్టులో లేవు అనే విషయం మీకు తెలుసా? ఖచ్చితంగా అప్పుడు తెలియదు కానీ… ఇప్పుడు ఆ మొక్క వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం రండి.

amazing health benefits of duvvena benda plant

amazing health benefits of duvvena benda plant

మనం పైన చదువుకున్న పేర్లన్నీ ఆ చెట్టువే. ఒక్కో చోట ఆ చెట్టును అన్ని రకాల పేర్లతో పిలుస్తుంటారు. ఈ మొక్క యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఇన్ఫ్లమేటరీ ధర్మాలను కలిగి ఉంటుంది. ఈ మొక్కలోని ప్రతి భాగం.. అంటే వేరు నుంచి బెరడు, పూలు, కాయలు, ఆకులు… అన్నీ ఔషధ గుణాలను కలిగి ఉన్నవే.

health benefits : జ్వరం వచ్చినా… దగ్గు వచ్చినా.. జలుబు చేసినా..

జ్వరం వచ్చినా… దగ్గు వచ్చినా.. జలుబు చేసినా.. ఎలాంటి వైరల్ ఫీవర్ వచ్చినా… ఈ మొక్క ఆకును వాడి తగ్గించవచ్చు. లంగ్స్ లో ఏవైనా ఇన్ఫెక్షన్ వచ్చినా… మూత్రనాల వ్యాధులకు, కిడ్నీల్లో రాళ్లు వచ్చినా.. ఈ మొక్కను ఉపయోగించి.. ఆయుర్వేద నిపుణులు వాటిని నయం చేస్తారు.చాలామందికి కీళ్లనొప్పులు ఉంటాయి. అలా కీళ్లనొప్పులు, కీళ్ల వాతం ఉన్నవాళ్లు… అతి బల ఆకులను తీసుకొని వాటిని పేస్ట్ లా చేసి.. ఆ పేస్ట్ కు కాసింత ఆవాల నూనె కలపాలి. ఆ మిశ్రమాన్ని కీళ్ల నొప్పులు, కీళ్ల వాతం ఉన్నచోట రుద్దితే… కీళ్లనొప్పులు తగ్గుతాయి.

చర్మంపై వచ్చే వాపులను తగ్గించడానికి కూడా ఈ ఆకు చాలా ఉపయోగపడుతుంది. కొన్ని అతిబల ఆకులను తీసుకొని… వాటిని ఉడికించి… చర్మంపై ఉన్న వాపుల దగ్గర కట్టాలి. దీంతో చర్మంపై ఉన్న వాపు తగ్గుతుంది.ఎవరికైనా ఏదైనా గాయం అయినా.. పుండ్లు అయినా.. కూడా ఈ ఆకులను తీసుకొని.. వాటిని పేస్ట్ లా చేసి… ఆ మిశ్రమానికి కొంచెం పసుపు కలిపి గాయం అయిన చోట… పుండ్లు అయిన చోట కడితే వెంటనే ఆ గాయం, పుండ్లు మానుతాయి.

మూత్రంలో మంట వచ్చినా… మూత్రాశయంలో రాళ్లు ఏర్పడినా… ఈ ఆకుల వల్ల ఆ సమస్యలు తొలగిపోతాయి. కొన్ని దువ్వెన బెండ ఆకులను తీసుకొని… కొన్ని నీళ్లలో వాటిని వేసి కాసేపు ఆ నీటిని మరిగించి ఆ తర్వాత దాన్ని వడపోసి.. అందులో ఇంత తేనె కలుపుకొని తాగాలి. అలా కనీసం ఓ పది రోజుల పాటు రోజులో కనీసం మూడుసార్లు అలా తాగితే వెంటనే మూత్రంలో వచ్చే మంట తగ్గడంతో పాటు… మూత్రాశయంలో ఏర్పడిన రాళ్లు కరిగి… మూత్రంలో వెళ్లిపోతాయి.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది