ChandraBabu : టీడీపీ ఆవిర్భావం రోజే చంద్రబాబు అరాచకాలు బయట పెట్టబోతున్నాం
ChandraBabu : మార్చి 29 వ తారీకు తెలుగు దేశం పార్టీ ఆవిర్భావ సభ జరగబోతుంది. ఆ సమయంలోనే తెలుగు దేశం పార్టీ యొక్క అరాచకాలను ఆ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చేసిన అవినీతిని మరియు గత కొన్నాళ్లుగా ఆ పార్టీ నాయకులు చేస్తున్న అక్రమాలకు సంబంధించిన గుట్టు రట్టు చేస్తామంటూ వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు తెలియ జేశారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అద్భుతమైన అభివృద్ధి సాధ్యమైంది. అంతే కాకుండా దేశంలోనే అత్యుత్తమ సంక్షేమ కార్యక్రమాలను జగన్ ప్రభుత్వం అమలు చేస్తోంది.
దీనిని చూసి ఓర్వలేక తెలుగు దేశం పార్టీ నాయకులు మరియు ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు రాష్ట్రంలో అల్ల కల్లోలం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ వైకాపా నాయకులు ఆరోపిస్తున్నారు. తాజాగా ఎమ్మెల్యే అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పై మరోసారి నిప్పులు చెరిగారు. జగన్ మూడు సంవత్సరాల పరిపాలన లో జరిగిన అభివృద్ధి తెలుగు దేశం పార్టీ అన్ని సంవత్సరాల్లో కూడా చేయలేక పోయిందని అన్నాడు.జగన్ ప్రభుత్వానికి ఉన్న చిత్త శుద్ధి వల్ల రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరగడంతో పాటు పలు పెండింగ్ ప్రాజెక్టులు కార్య రూపం దాల్చాయి

ambati rambabu comments on ChandraBabu naidu
అని అంబటి రాంబాబు తెలియ జేశాడు. రాష్ట్రంలో అవినీతి చాలా వరకు తగ్గడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అవినీతిని పెంచి పోషించడం మాత్రమే కాకుండా పార్టీ అధి నేతలు మరియు ముఖ్య నాయకులు కూడా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. రాబోయే కాలంలో కూడా సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఉంటారని.. అందులో ఎలాంటి అనుమానం అక్కర లేదు అని ఈ సందర్భంగా అంబటి రాంబాబు అన్నారు.