Anchor Suma : దేవీ నాగవల్లి పరువుతీస్తున్నారు.. సెటైర్లు వేసిన యాంకర్ సుమ

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: May 22, 2022, 7:30 pm

Anchor Suma : టీవీ 9 యాంకర్‌గా దేవీ నాగవల్లి మీదున్న నెగెటివిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గతంలో దేవీ నాగవల్లి మీద ఎన్నో రకాల ట్రోల్స్ జరిగాయి. ఆమె మీదున్న ఈ నెగెటివిటీతోనే దేవీ నాగవల్లి ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. బిగ్ బాస్ షోలో దేవీ నాగవల్లి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అందరూ భావించారు. చివరి వరకు ఉంటుందని అనుకున్నారు. కానీ దేవీ నాగవల్లి మాత్రం బయటకు వచ్చేసింది. దానికి కారణం ఆమెకున్న ఈ నెగెటివ్ ఇమేజ్. అయితే బిగ్ బాస్ వల్ల అంతో ఇంతో పాజిటివిటీ ఏర్పడింది.

Anchor Suma Imitates Devi Nagavalli Get out Scene

Anchor Suma Imitates Devi Nagavalli Get out Scene

కానీ దేవీ నాగవల్లి మాత్రం తన ఇంటర్వ్యూలు, చిన్న హీరోలను ప్రశ్నించే విధానం, ఆ ప్రశ్నల వల్ల విపరీతమైన నెగెటివిటీని మూటగట్టుకుంటోంది. గతంలో విజయ్ దేవరకొండ, ఆ మధ్య సిద్దు జొన్నలగడ్డ, ఇప్పుడు విశ్వక్ సేన్. అలా దేవీ నాగవల్లి సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురవుతోంది. రీసెంట్‌గా విశ్వక్ సేన్ వర్సెస్ దేవీ నాగవల్లి వివాదం ఎలా జరిగిందో అందరికీ తెలిసిందే. గేట్ అవుట్ ఫ్రమ్ మై స్టూడియో అంటూ చాలా దురుసుగా ప్రవర్తించింది. దేవీ నాగవల్లి ప్రవర్తన మీద అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

గెట్ అవుట్ అంటూ దేవీ నాగవల్లిని విపరీతంగా ట్రోల్ చేశారు. ఇక ఇప్పుడు బుల్లితెరపై స్కిట్లలోనూ దేవీ నాగవల్లిని ఇమిటేట్ చేసి ఆ సంఘటన మీద సెటైర్లు వేస్తున్నారు. మొన్నామధ్య జబర్దస్త్ షోలో పొట్టి నరేష్ ఇలానే స్కిట్ వేశాడు. ఇక ఇప్పుడు సుమ కూడా దేవీ నాగవల్లిని వదిలిపెట్టలేదు. క్యాష్ షోలో యాంకర్ సుమ రెచ్చిపోయింది. కావాలనే దేవీ నాగవల్లిని టార్గెట్ చేసిందో లేదంటే.. తనకు తెలియకుండానే డైరెక్షన్ టీం చెప్పినట్టుగా చేసుకుంటూ వెళ్లిందో గానీ మొత్తానికి కౌంటర్లు మాత్రం వేసేసింది.

వచ్చే వారం ప్రసారం కానున్న క్యాష్ ఎపిసోడ్ ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో డేగల బాబ్జీ టీం వచ్చింది. బండ్ల గణేష్, సమీర్, జోష్ రవి, డైరెక్టర్ వచ్చారు. ఇందులో ఓ స్కిట్లో భాగంగా సమీర్ మధ్యలోకి ఎంట్రీ ఇస్తాడు. దీంతో కోపంతో సుమ.. గెట్ అవుట్ ఫ్రమ్ మై స్టూడియో అంటుంది. అలా రెండు మూడు సార్లు అచ్చం దేవీ నాగవల్లిలానే సుమ గెట్ అవుట్ అని అంటుంది.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp