Vishnupriya : నాకు అది రోజూ ఉండాల్సిందే.. రోజంతా అయినా చేస్తూ ఉండగలను.. విష్ణుప్రియ షాకింగ్ పోస్ట్ వైరల్? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vishnupriya : నాకు అది రోజూ ఉండాల్సిందే.. రోజంతా అయినా చేస్తూ ఉండగలను.. విష్ణుప్రియ షాకింగ్ పోస్ట్ వైరల్?

 Authored By jagadesh | The Telugu News | Updated on :25 June 2021,9:08 pm

Vishnupriya : యాంకర్ విష్ణుప్రియ తెలుసు కదా. తను చాలాయాక్టివ్. ప్రస్తుతం తెలుగు బుల్లితెర మీద టాప్ యాంకర్ గా కొనసాగుతోంది విష్ణుప్రియ. చాలా షోలలో తను ఇప్పుడు యాంకర్. అలాగే తను సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియాతో పాటు పలు షోలలో పార్టిసిపేట్ చేసినప్పుడు తను చేసే అల్లరి మామూలుగా ఉండదు. తన అల్లరికే చాలామంది పడిపోతారు. తన యాంకరింగ్ కానీ.. తన నవ్వు కానీ.. అన్నీ బాగుంటాయి. అందుకే తను తెలుగు బుల్లితెర మీద అంత పాపులారిటీ.

anchor vishnupriya instagram post viral

anchor vishnupriya instagram post viral

విష్ణుప్రియ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. ఎక్కువగా తన డ్యాన్స్ వీడియోలో అందులో కనిపిస్తాయి. ఆ మధ్య.. పొట్టి డ్రెస్ వేసుకొని తను వేసిన డ్యాన్స్ తెగ వైరల్ అయింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుండటం వల్ల.. తన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Vishnupriya : తాజాగా మరో పోస్ట్ షేర్ చేసిన విష్ణుప్రియ

విష్ణుప్రియ తాజాగా మరో పోస్ట్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. నిజానికి తనకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే చాలా ఇష్టమట. చిన్నప్పుడు స్కూల్ లో కూడా తను డ్యాన్స్ కాంపిటిషన్ లో పార్టిసిపేట్ చేసేదట. చిన్నతనం నుంచే తనకు డ్యాన్స్ అంటే ఇష్టమని.. చిన్నప్పుడు స్కూల్ లో డ్యాన్స్ చేసినప్పుడు దిగిన ఓ ఫోటోను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసి తన చిన్ననాటి విషయాలను ఈసందర్భంగా గుర్తు చేసుకుంది విష్ణుప్రియ.

anchor vishnupriya instagram post viral

anchor vishnupriya instagram post viral

2009 లో మా స్కూల్ వార్షికోత్సవ సెలబ్రేషన్స్ సమయంలో నేను డ్యాన్స్ వేసిన ఫోటో అది. అప్పుడు నేను చేసిన ఎంజాయ్ మెంట్ ను మాత్రం అస్సలు మరిచిపోలేను. స్కూల్ వార్షికోత్సవ వేడుకల్లో డ్యాన్స్ చేయడం కోసం రెండు నెలల పాటు డ్యాన్స్ ప్రాక్టీస్ చేశాం. 10 ఏళ్ల తర్వాత అదే నా ప్రొఫెషన్ అవుతుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. ప్రస్తుతం నా ప్రపంచం కూడా డ్యాన్సే. డ్యాన్స్ లేకుండా నేను ఉండలేను. ప్రతి రోజు డ్యాన్స్ వేస్తూనే ఉంటాను. డ్యాన్స్ అంతే అంత పిచ్చి నాకు. కంటిన్యూగా డ్యాన్స్ వేస్తూనే ఉంటా.. అంటూ ఆ ఫోటోను షేర్ చేసింది విష్ణుప్రియ. ఇక.. విష్ణుప్రియ స్కూల్ డ్యాన్స్ ఫోటోను చూసిన నెటిజన్లు ఆగుతారా? ఆ ఫోటోను తెగ వైరల్ చేస్తున్నారు. చిన్నప్పుడు కూడా భలే క్యూట్ గా ఉన్నావు విష్ణు ప్రియ అంటూ తెగ పొగిడేస్తున్నారు.

jagadesh

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి