YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మొదటి నుంచి వ్యవసాయానికి సంబంధించి అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. వైసీపీ పార్టీ రైతుల పార్టీ అని కూడా చాలా సందర్భాలలో చెప్పటం జరిగింది. ఇప్పుడు ఆ రీతిగానే అధికారంలోకి వచ్చాక రైతులకు మేలు చేకూరే రీతిలో ప్రభుత్వం తరఫున అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఇటీవల అకాల వర్షాలు.. వరదలు కారణంగా నష్టపోయిన పంట రైతులకు ఇన్ పుట్ సబ్సిడీతో పాటు.. వైయస్సార్ సున్నా వడ్డీ రాయితీని రైతుల ఎకౌంట్లో జమ చేయడం జరిగింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేశారు.
వైయస్సార్ సున్నా వడ్డీ రాయితీ ఇన్పుట్ సబ్సిడీతోపాటు గతంలో సాంకేతిక కారణాలతో చెల్లింపులు పొందని వారి ఖాతాలో కూడా… దాదాపు ₹200 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడం జరిగింది. రబీ 2020–21 సీజన్ లో అర్హత పొందిన 2.54 లక్షల మందికి ₹45.22 కోట్లు, ఖరీఫ్-2021 సీజన్ లో అర్హత పొందిన 5.68 లక్షల మందికి సున్నా వడ్డీ రాయితీ కింద ₹115.33 కోట్లు జమ చేశారు. అదే విధంగా ఖరీఫ్-2022 సీజన్ లో జూలై నుంచి అక్టోబర్ మధ్య గోదావరి వరదలు, అకాల వర్షాలవల్ల దెబ్బతిన్న 45,998 మంది రైతులకు రూ. 39.39 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ రైతు బాగుంటాయని రాష్ట్రం బాగుంటుందని తెలియజేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 62 శాతం జనాభా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో రైతులు పంట నష్టాల అంచనా విషయంలో అనేక అవస్థలు పడ్డారు. ఈ క్రమంలో పరిహారం కోసం ఉద్యోగాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేది. పంట నష్టం విషయంలో గత ప్రభుత్వ మరో కొరగా సాయం అన్న విధంగా కొన్నిసార్లు వచ్చేదో లేదో కూడా తెలియని పరిస్థితిలో రైతులు ఉండేవారు. కానీ మన ప్రభుత్వం వచ్చాక ఈ క్రాప్ ఆధారంగా… నమోదైన వాస్తవ సాగదారులకు క్రమం తప్పకుండా పరిహారం చెల్లిస్తున్నాం. ఏ సీజన్ లో పంట నష్టం జరిగితే అదే సీజన్ లో పరిహారాన్ని రైతులకు ఇస్తున్నాం. గత ప్రభుత్వంలో రైతు భరోసా పథకం లేదు.
0 వడ్డీ పథకాన్ని ఎక్కొట్టింది అని జగన్ పేర్కొన్నారు. అంతేకాదు రైతు రుణమాఫీ చేస్తానని చంద్రబాబు నాయుడు గతంలో రైతులను మోసం చేశారని వండిపడ్డారు. అక్క చెల్లెమ్మల బంగారాన్ని కూడా బ్యాంకు నుండి తీసుకొస్తానని ఎన్నికలలో హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చి రైతులను గత ప్రభుత్వం మోసం చేయడం జరిగిందని.. పేర్కొన్నారు. ఈ క్రమంలో గత ప్రభుత్వానికి తమ ప్రభుత్వానికి తేడాను గమనించాలని జగన్ రైతులను సూచించారు. దీంతో ప్రభుత్వం అందించిన నష్టపరిహారం అందుకున్న రైతులు సీఎం జగన్ ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. రైతు ముఖ్యమంత్రి అంటూ కొనియాడుతున్నారు.
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
This website uses cookies.