YS Jagan : వైయస్ జగన్ రైతుల సీఎం.. అంటున్న ఏపీ రైతులు..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YS Jagan : వైయస్ జగన్ రైతుల సీఎం.. అంటున్న ఏపీ రైతులు..!!

 Authored By sekhar | The Telugu News | Updated on :29 November 2022,1:30 pm

YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మొదటి నుంచి వ్యవసాయానికి సంబంధించి అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. వైసీపీ పార్టీ రైతుల పార్టీ అని కూడా చాలా సందర్భాలలో చెప్పటం జరిగింది. ఇప్పుడు ఆ రీతిగానే అధికారంలోకి వచ్చాక రైతులకు మేలు చేకూరే రీతిలో ప్రభుత్వం తరఫున అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఇటీవల అకాల వర్షాలు.. వరదలు కారణంగా నష్టపోయిన పంట రైతులకు ఇన్ పుట్ సబ్సిడీతో పాటు.. వైయస్సార్ సున్నా వడ్డీ రాయితీని రైతుల ఎకౌంట్లో జమ చేయడం జరిగింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేశారు.

వైయస్సార్ సున్నా వడ్డీ రాయితీ ఇన్పుట్ సబ్సిడీతోపాటు గతంలో సాంకేతిక కారణాలతో చెల్లింపులు పొందని వారి ఖాతాలో కూడా…  దాదాపు ₹200 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడం జరిగింది. రబీ 2020–21 సీజన్ లో అర్హత పొందిన 2.54 లక్షల మందికి ₹45.22 కోట్లు, ఖరీఫ్-2021 సీజన్ లో అర్హత పొందిన 5.68 లక్షల మందికి సున్నా వడ్డీ రాయితీ కింద ₹115.33 కోట్లు జమ చేశారు. అదే విధంగా ఖరీఫ్-2022 సీజన్ లో జూలై నుంచి అక్టోబర్ మధ్య గోదావరి వరదలు, అకాల వర్షాలవల్ల దెబ్బతిన్న 45,998 మంది రైతులకు రూ. 39.39 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీని జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ రైతు బాగుంటాయని రాష్ట్రం బాగుంటుందని తెలియజేశారు.

andhra pradesh farmers praises chief minister ys jagan

andhra pradesh farmers praises chief minister ys jagan

రాష్ట్రవ్యాప్తంగా 62 శాతం జనాభా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో రైతులు పంట నష్టాల అంచనా విషయంలో అనేక అవస్థలు పడ్డారు. ఈ క్రమంలో పరిహారం కోసం ఉద్యోగాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేది. పంట నష్టం విషయంలో గత ప్రభుత్వ మరో కొరగా సాయం అన్న విధంగా కొన్నిసార్లు వచ్చేదో లేదో కూడా తెలియని పరిస్థితిలో రైతులు ఉండేవారు. కానీ మన ప్రభుత్వం వచ్చాక ఈ క్రాప్ ఆధారంగా… నమోదైన వాస్తవ సాగదారులకు క్రమం తప్పకుండా పరిహారం చెల్లిస్తున్నాం. ఏ సీజన్ లో పంట నష్టం జరిగితే అదే సీజన్ లో పరిహారాన్ని రైతులకు ఇస్తున్నాం. గత ప్రభుత్వంలో రైతు భరోసా పథకం లేదు.

0 వడ్డీ పథకాన్ని ఎక్కొట్టింది అని జగన్ పేర్కొన్నారు. అంతేకాదు రైతు రుణమాఫీ చేస్తానని చంద్రబాబు నాయుడు గతంలో రైతులను మోసం చేశారని వండిపడ్డారు. అక్క చెల్లెమ్మల బంగారాన్ని కూడా బ్యాంకు నుండి తీసుకొస్తానని ఎన్నికలలో హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చి రైతులను గత ప్రభుత్వం మోసం చేయడం జరిగిందని.. పేర్కొన్నారు. ఈ క్రమంలో గత ప్రభుత్వానికి తమ ప్రభుత్వానికి తేడాను గమనించాలని జగన్ రైతులను సూచించారు. దీంతో ప్రభుత్వం అందించిన నష్టపరిహారం అందుకున్న రైతులు సీఎం జగన్ ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. రైతు ముఖ్యమంత్రి అంటూ కొనియాడుతున్నారు.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది