Anil Kumar Yadav : కత్తితో పొడిచారు మిమ్మల్ని విడిచి పెట్టే ప్రసక్తే లేదు అనిల్ కుమార్ స్ట్రాంగ్ వార్నింగ్ వీడియో..!!
Anil Kumar Yadav : గత కొద్ది రోజులుగా నెల్లూరు జిల్లా రాజకీయం ఏపీ రాజకీయాలలో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ అధికార పార్టీ వైసీపీకీ నెల్లూరు జిల్లా కంచుకోట లాంటిది. ఇప్పుడు ఎన్నికలు జరిగినా నెల్లూరులో అత్యధిక స్థానాలు వైసీపీయే గెలవడం జరిగింది. అటువంటి నెల్లూరు జిల్లాలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి వ్యవహారం వైసిపి పార్టీకి తలనొప్పిగా మారింది. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం తెలిసిందే. ఈ క్రమంలో తన ఫోన్ ట్యాపింగ్ చేశారని… ప్రభుత్వంపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేయడం తెలిసిందే. దీంతో వైసీపీ హై కమాండ్ ఎమ్మెల్యే కోటంరెడ్డిపై నియోజకవర్గ సంబంధిత పార్టీ పదవుల నుండి తప్పించటం జరిగింది.
ఈ క్రమంలో నెల్లూరు నియోజకవర్గంలో మిగతా వైసీపీ నేతలు కోటంరెడ్డి తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వీరిలో మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా ఒకరు. ఈ క్రమంలో అనిల్ కుమార్ యాదవ్ వర్గానికి మరియు కోటంరెడ్డి వర్గానికి మధ్య ఇటీవల గొడవ జరగడం తెలిసిందే. ముస్లిం మైనారిటీ వర్గాలు పడిన ఈ గొడవలో అనిల్ వర్గానికి చెందిన సమీర్ అనే వ్యక్తికి భారీగా కత్తిపోట్లకీ గురికావడం జరిగింది. ప్రస్తుతం చికిత్స తీసుకుంటూ ఉన్నాడు. అయితే ఈ గొడవపై అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ… ఘటనకు పాల్పడిన ఏ ఒక్కరిని వదలను అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తి మతం ముసుగులో నీచతి నీచంగా ఆ ప్రాంతంలో వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాస్తూ…
ఇలా వైసిపి కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసే చిల్లరి వ్యక్తి అని విమర్శించారు. అనేకసార్లు మాపై గొడవలకు వచ్చినా గాని మా వాళ్లు చాలా సమయమనం పాటించారని అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. అతని విమర్శిస్తే మొత్తం ముస్లిం వర్గాన్ని విమర్శించినట్టుగా ఒక అనిచ్చితి క్రియేట్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. అటువంటి వ్యక్తికి కొంతమంది నేతలు డబ్బులు ఇచ్చి మరీ మీడియా సమావేశాలు పెట్టిస్తున్నారు. ఆ నాయకులు ఎవరో నాకు తెలుసు. కానీ పేర్లు బయట పెట్టదలుచుకోలేదు. ఇటీవల వైసిపి పార్టీని వీడిన శాసనసభ్యుడు అనుచరుడుగా పరోక్షంగా కోటంరెడ్డి అనుచరుడు అంటూ అనిల్ కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.