Anjeer | అంజీర్‌ పండ్లు తింటే డబుల్‌ ప్రయోజనాలు.. ఎలా తినాలి అంటే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Anjeer | అంజీర్‌ పండ్లు తింటే డబుల్‌ ప్రయోజనాలు.. ఎలా తినాలి అంటే..!

 Authored By sandeep | The Telugu News | Updated on :22 October 2025,7:30 am

Anjeer | ఆరోగ్యానికి మేలు చేసే పండ్లలో అంజీర్‌ (అత్తి పండ్లు) ప్రధానమైనది. ఇందులో దాగి ఉన్న పోషకాలు శరీరానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ప్రోటీన్‌, ఫైబర్‌, కాల్షియం, పొటాషియం, ఇనుము, రాగి వంటి కీలకమైన సూక్ష్మ పోషకాలు అంజీర్‌లో సమృద్ధిగా లభిస్తాయి. ఇవి శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడతాయి.

#image_title

ప్ర‌యోజ‌నాలెన్నో..

డైటీషియన్లు చెబుతున్న వివరాల ప్రకారం — రాత్రిపూట నీటిలో నానబెట్టిన అంజీర్‌ పండ్లను ఉదయం ఖాళీ కడుపుతో తింటే బరువు తగ్గడంలో అద్భుత ఫలితాలు కనిపిస్తాయి. ఈ పండ్లలో కేలరీలు తక్కువగా ఉండటమే కాకుండా మెటబాలిజాన్ని మెరుగుపరచి ఫ్యాట్‌ బర్న్‌కు సహాయపడతాయి.

ఇనుము లోపంతో బాధపడేవారికి అంజీర్‌ పండ్లు ఎంతో ఉపయోగకరం. ఇవి హిమోగ్లోబిన్‌ స్థాయిలను పెంచి రక్తహీనతను నివారిస్తాయి. అంతేకాకుండా చర్మానికి సహజ కాంతిని అందిస్తాయి. రెగ్యులర్‌గా తినడం వల్ల ముఖం ప్రకాశవంతంగా మారుతుంది. అంజీర్‌లోని పోషకాలు గుండె ఆరోగ్యం, ఎముకల బలం, రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడతాయి.

ఎలా తినాలి:
ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఒకటి లేదా రెండు నానబెట్టిన అంజీర్‌ పండ్లు తింటే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. రాత్రిపూట వేడి పాలలో వేసుకుని తిన్నా అదే ప్రయోజనాలు అందుతాయి.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది