WhatsApp : ప్రముఖ మెసేజ్ యాప్ అయినటువంటి వాట్సాప్ తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో ముందుకు వస్తుంది. ఇప్పటికే చాలా ఫీచర్స్ ను పరిచయం చేసిన వాట్సాప్ తాజాగా మరో కొత్త ఫీచర్ ని తీసుకువచ్చింది. స్కిప్ ఫార్వర్డ్, బ్యాక్ వర్డ్ అని పిలిచే కొత్త ఫీచర్ తో సెండ్ చేసిన, రిసీవ్ చేసుకున్న వీడియోలను 10 సెకండ్ల పాటు ఫార్వర్డ్ లేదా బ్యాక్ వర్డ్ స్కిప్ చేసుకోవచ్చు. అయితే ఇది ప్రస్తుతం కొంతమందికే రిలీజ్ అవుతుంది. ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.23.24.6 ఇన్ స్టాల్ చేసుకున్న వారికి ఈ కొత్త ఫీచర్ రిలీజ్ అవుతుంది.
వీడియోలో పార్ట్స్ ని స్కిప్ చేయడానికి కంపెనీకి కొత్త ఫీచర్ను అందిస్తుంది. యూజర్లు ఇప్పుడు వీడియోను ఫార్వర్డ్ లేదా రివైండ్ చేయడానికి స్క్రీన్ లెఫ్ట్ లేదా రైట్ సైడ్ డబుల్ ట్యాప్ చేయవచ్చు. ఈ ఫీచర్ను ఆల్రెడీ యూట్యూబ్ యూజర్లకు అందించింది. ఈ వీడియో షేర్ అప్లికేషన్ లో స్కిప్ పై నొక్కడం ద్వారా వీడియోలను స్కిప్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ను ఇప్పటికే యూట్యూబ్ యూజర్లు చాలామంది వాడే ఉంటారు. ఇప్పుడు వాట్సాప్ లో రాబోయే కొత్త ఫీచర్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది. గతంలో వీడియో స్కిప్ చేయాలంటే ప్రోగ్రెస్ బార్ ని లాగాల్సి వచ్చేది.
ఒక్కోసారి ప్రోగ్రెస్ బార్‌పై సరిగా డ్రాగ్ చేయలేక వీడియో కావలసిన దానికంటే ఎక్కువ ముందుకు వెళ్లిపోయేది. లేదంటే బ్యాక్‌వర్డ్‌కు వెళ్ళిపోయేది. దీనివల్ల కొద్ది సెకన్ల పాటు వీడియో స్కిప్ చేయలేక యూజర్లు ఇబ్బంది పడేవారు. ఇప్పుడా అవసరం లేకుండా వీడియోలోని అత్యంత ముఖ్యమైన లేదా ఆసక్తికరమైన పార్ట్‌కు ఈజీగా ఫార్వర్డ్ చేయవచ్చు లేదా వారు మిస్ అయిన దాన్ని మళ్లీ చూడటానికి రివైండ్ చేయవచ్చు. అయితే ఈ ఫీచర్ కొంతమంది బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండగా రాబోయే వారాల్లో మరింతమందికి రిలీజ్ అవుతుందని బీటా ఇన్ఫో వెల్లడించింది. బీటా 2.23.24.4, 2.23.24.5 వెర్షన్స్ ఇన్‌స్టాల్ చేసుకున్న కొందరికి మాత్రమే ఈ ఫీచర్ లభిస్తుందని కంపెనీ తెలిపింది.
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.