Big Breaking : త్వరలో తెలంగాణలో మరో ఉప ఎన్నిక ..?
Big Breaking : 2018 వ సంవత్సరంలో తెలంగాణలో టిఆర్ఎస్ రెండోసారి అధికారం చేపట్టాక ఐదు ఉప ఎన్నికలు వచ్చాయి. 5 ఉప ఎన్నికలలో మూడింటిలో టిఆర్ఎస్ పార్టీ గెలవడం జరిగింది. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలలో బీజేపీ గెలిచింది. నాగార్జునసాగర్, హుజూర్ నగర్.. రీసెంట్ గా మునుగోడు ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ గెలవడం జరిగింది. అయితే జరిగిన చివరి 3 ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీకి బిజెపి మంచి పోటీ ఇచ్చింది. మునుగోడు ఉప ఎన్నికలలో సైతం కొన్ని రౌండ్ లలో బీజేపీ ముందంజలో ఉంది.
సో తాజా పరిణామాలు బట్టి తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీని ఢీకొట్టే దమ్ము తమకే ఉందని బీజేపీ శ్రేణులు భావిస్తున్నారు. దీంతో తెలంగాణలో పొలిటికల్ గా కేసీఆర్ నీ ఒక్కరి బిక్కిరి చేయడానికి కమలం పార్టీ ఉప ఎన్నికలను అస్త్రంగా మలుచుకున్నట్లు వార్తలొస్తున్నాయి. సో మునుగోడు ఉపఎన్నిక ఫలితం వచ్చి వారం కాకముందే తెలంగాణ రాష్ట్రంలో మరో ఉప ఎన్నికల రానున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది .పూర్తి విషయంలోకి వెళ్తే ఉమ్మడి కర్నూలు జిల్లాలో వేములవాడలో ఉప ఎన్నిక రానున్నట్లు తెలంగాణ రాజకీయాలలో జోరుగా ప్రచారం జరుగుతుంది.
కారణాలు చూస్తే వేములవాడ ప్రజెంట్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు పౌరసత్వంపై చాలా రోజులుగా న్యాయస్థానాలలో వాదనలు నడుస్తున్నాయి. ఇక ఇదే సమయంలో చెన్నమనేని రమేష్ బాబు శాసన సభ్యుడిగా కొనసాగే అర్హత లేదని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ హైకోర్టుకు నివేదించింది. ఆయనకు జర్మనీ పౌరసత్వం ఉండటంతో రెండు పౌరసత్వలు ఉండటం కారణంగా… ఆయన శాసన సభ్యత్వాన్ని కోరుతు రద్దు చేసే అవకాశం ఉందని.. వేములవాడలో ఉప ఎన్నికలు రానున్నాయని సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా జరుగుతుంది.