Union Budget 2026 : రైతుల‌కు గుడ్‌న్యూస్‌.. కేంద్ర బడ్జెట్ లో కొత్తగా మరో పథకం..!

Union Budget 2026 : రైతుల‌కు గుడ్‌న్యూస్‌.. కేంద్ర బడ్జెట్ లో కొత్తగా మరో పథకం..!

 Authored By suma | The Telugu News | Updated on :27 January 2026,5:00 pm

ప్రధానాంశాలు:

  •  Union Budget 2026 : రైతుల‌కు గుడ్‌న్యూస్‌.. కేంద్ర బడ్జెట్ లో కొత్తగా మరో పథకం..!

Union Budget 2026 : దేశ ఆర్థిక దిశను నిర్దేశించే కేంద్ర బడ్జెట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండటంతో దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. సామాన్యుల నుంచి పారిశ్రామిక వర్గాల వరకు రైతుల నుంచి యువత వరకు ఈ బడ్జెట్‌లో ఎలాంటి నిర్ణయాలు ఉంటాయన్నది చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా త్వరలో పశ్చిమబెంగాల్, తమిళనాడు వంటి కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బడ్జెట్ ప్రకటనలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Union Budget 2026 రైతుల‌కు గుడ్‌న్యూస్‌ కేంద్ర బడ్జెట్ లో కొత్తగా మరో పథకం

Union Budget 2026 : రైతుల‌కు గుడ్‌న్యూస్‌.. కేంద్ర బడ్జెట్ లో కొత్తగా మరో పథకం..!

Union Budget 2026 : ఎన్నికల నేపథ్యంలో బడ్జెట్ వ్యూహం

ఎన్నికల సంవత్సరంలో వచ్చే బడ్జెట్ కావడంతో ప్రభుత్వం ప్రజాకర్షక నిర్ణయాలపై దృష్టి పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త సంక్షేమ పథకాలు ఇప్పటికే అమలులో ఉన్న పథకాల విస్తరణ ఆదాయపు పన్ను మినహాయింపులు, జీఎస్టీ రాయితీలపై కీలక ప్రకటనలు ఉండొచ్చని అంచనా. మధ్యతరగతి భారం తగ్గించే చర్యలతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా రైతులకు మేలు చేసే విధంగా సబ్సిడీలు, తక్కువ వడ్డీ రుణాలు, వ్యవసాయ మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెంచే దిశగా బడ్జెట్ ఉండొచ్చని సమాచారం.

Union Budget 2026 : పీఎం కుసుమ్ 2.0: సౌరశక్తితో రైతుల భవిష్యత్

ఈ బడ్జెట్‌లో ప్రధాన ఆకర్షణగా పీఎం కుసుమ్ పథకం రెండో దశ (PM KUSUM 2.0)పై ప్రకటన ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమలులో ఉన్న పథకం గడువు మార్చి 2026తో ముగియనున్న నేపథ్యంలో మరింత విస్తృత లక్ష్యాలతో కొత్త దశను ప్రారంభించనున్నారు. రైతులకు తక్కువ ధరలకే స్వచ్ఛమైన సౌర విద్యుత్ అందించడం డీజిల్‌పై ఆధారపడటాన్ని తగ్గించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. గ్రామీణ ప్రాంతాల్లో సౌర ప్రాజెక్టులను ప్రోత్సహించడం ద్వారా రైతుల ఆదాయం పెంచడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు కూడా ఇది తోడ్పడనుంది.

Union Budget 2026 : భారీ కేటాయింపులు, ఆధునిక సాంకేతికత

పీఎం కుసుమ్ 2.0 పథకానికి ఈ బడ్జెట్‌లో సుమారు రూ.50 వేల కోట్ల వరకు కేటాయింపులు ఉండవచ్చని అంచనా. తొలి దశలో ప్రభుత్వం ఇప్పటికే రూ.32,400 కోట్లు వెచ్చించింది. కొత్త దశలో రైతులకు సౌర ప్యానెల్‌ల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు ఆధునిక టెక్నాలజీ వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ముఖ్యంగా బ్యాటరీ నిల్వ సాంకేతికతను ప్రవేశపెట్టడం ద్వారా పగలు, రాత్రి అనే తేడా లేకుండా రైతులకు విద్యుత్ అందించనున్నారు. ఇది విద్యుత్ సరఫరాను మరింత నమ్మదగినదిగా మార్చనుంది. 2019లో ప్రారంభమైన పీఎం కుసుమ్ యోజన ఇప్పటికే రైతులకు సౌర పంపులు, విద్యుత్ సౌకర్యం అందిస్తూ మంచి ఫలితాలు ఇస్తోంది. 2024లో దీన్ని మరింత విస్తరించారు. ఇప్పుడు 2.0 రూపంలో ఈ పథకం రైతులకు విద్యుత్‌తో పాటు నీటి భద్రతను కూడా కల్పించే దిశగా ముందుకు సాగనుంది. ఇక ఈ కేంద్ర బడ్జెట్ రైతుల జీవన ప్రమాణాలు పెంచేలా దేశాన్ని హరితశక్తి వైపు నడిపించేలా ఉండనుందని ఆశలు వ్యక్తమవుతున్నాయి.

 

suma

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది