అందుకే అనుష్కను అలా అంటారు.. ఎంతైనా నిజంగానే స్వీటీ.. వైరల్ వీడియో
టాలీవుడ్ స్వీటీ అనుష్క గురించి ఇండస్ట్రీలో ఎవ్వరిని అడిగినా కూడా ఒకే మాట చెబుతుంటారు. అనుష్క అంటే సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్ అంటూ ప్రశంసలు కురిపిస్తుంటారు. అది సెట్‌లో అయినా ఈవెంట్‌లో అయినా ఎక్కడైనా సరే అనుష్క ఒదిగేఉంటుంది. గర్వాన్ని ప్రదర్శించదు. తాజాగా అది మరోసారి నిరూపితమైంది. అనుష్క ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా సాధారణ అమ్మాయిలా ప్రయాణం చేసింది.

Anushka Shetty Visited Polavaram Video goes viral
అనుష్క పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంకు వెళ్లింది. పంచాయతీ పరిధిలోని గోదావరి మధ్యలో ఉన్న మహా నందీశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించింది. సన్నిహితులతో కలిసి పడవలో గోదావరి నది దాటిన ఆమె ముఖానికి మాస్కు ఉండటం వల్ల స్థానికులు వెంటనే గుర్తుపట్టలేకపోయారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తన కాస్ట్యూమ్ డిజైనర్ ప్రశాంతితో కలిసి స్వీటీ కనిపించింది. అనుష్క ఇలా ఎంతో సాధారణంగా కనిపించడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అయితే అనుష్క ఎంతో అంచనాలు పెట్టుకున్న నిశ్శబ్దం మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక అనుష్క చేతిలో ప్రస్తుతం ఎలాంటి ప్రాజెక్ట్‌లు లేనట్టు కనిపిస్తోంది. మొత్తానికి అనుష్క మాత్రం ఇప్పుడు తన సింప్లిసిటీతో అందరి మనసులను ఆకట్టుకుంది.
@MsAnushkaShetty Visited Pattiseema Temple Today Near #Polavaram ❤️#AnushkaShetty
????:- @rajeshmanne1 pic.twitter.com/x18RPNeV0G
— Anushk Shetty TM (@AnushkaShettyTM) December 9, 2020