AP Assembly session 2023: ₹2,79,279 కోట్ల రూపాయలతో ఏపీ 2023-24 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

AP Assembly session 2023: ₹2,79,279 కోట్ల రూపాయలతో ఏపీ 2023-24 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన..!!

 Authored By sekhar | The Telugu News | Updated on :16 March 2023,11:57 am

AP Assembly session 2023: ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మూడో రోజు అసెంబ్లీలో 2023-24 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. మహిళలు మరియు పిల్లలకు పెద్దపీట వేస్తూ సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ కేటాయింపులు చేశారు. ముందుగా పోతన భాగవతం పద్యం చదివి తర్వాత.. రవీంద్రనాథ్ ఠాగూర్ కవితను ఉదాహరించి … బడ్జెట్ కేటాయింపులు చదివి వినిపించడం జరిగింది.

AP Assembly Budget Session 2023 2024

AP Assembly Budget Session 2023 – 2024

2023 బడ్జెట్ కి సంబంధించి వివిధ పథకాలకు కేటాయింపుల లెక్కలు…

ఏపీ ద్రవ్యలోటు 1.54 శాతం, జీఎస్డీపీలో రెవిన్యూ లోటు 3.77 శాతం, ​​​​​​​రెవిన్యూ వ్యయం రూ.2,28,540 కోట్లు, మూలధన వ్యయం రూ.31,061 కోట్లు, ​​​​​​​రెవిన్యూ లోటు రూ.22,316 కోట్లు, ​​​​ద్రవ్య లోటు రూ.54,587 కోట్లు​​​​​, జగనన్న విద్యా కానుక రూ.560 కోట్లు, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధికి రూ.15,873 కోట్లు, పురపాలక పట్టణాభివృద్ధి రూ.9,381 కోట్లు,  స్కిల్ డెవలప్‌మెంట్ రూ.1,166 కోట్లు, లా నేస్తం రూ.17 కోట్లు, యువజన అభివృద్ధా, పర్యాటకం, సాంస్కృతి శాఖ రూ.1,291 కోట్లు, షెడ్యూలు కులాల కాంపొనెంట్ కోసం రూ.20,005 కోట్లు, వైఎస్ఆర్ కల్యాణ మస్తు రూ.200 కోట్లు, వైఎస్‌ఆర్ ఆసరా రూ.6,700 కోట్లు, షెడ్యూల్ తెగల కాంపొనెంట్ కోసం రూ.6,929 కోట్లు,

వెనుకబడిన తరగతుల కాంపొనెంట్ కోసం రూ.38,605 కోట్లు, వైఎస్ఆర్ చేయూత రూ.5వేల కోట్లు, అమ్మ ఒడి రూ.6,500 కోట్లు, మొత్తంగా డీబీటీ స్కీంలకు రూ.54,228.36 కోట్లు, ధరల స్థిరీకరణ నిధి రూ.3 వేల కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణ రూ.1,212 కోట్లు, వైద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం కోసం రూ.15,882 కోట్లు, కాపు సంక్షేమం రూ.4,887 కోట్లు, నీటి వనరుల అభివృద్దికి రూ.11,908 కోట్లు, డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాల కోసం రూ.1000 కోట్లు, రైతులకు వడ్డీలేని రుణాలు రూ.500 కోట్లు, వైఎస్ఆర్ కాపు నేస్తం రూ.550 కోట్లు, జగనన్న చేదోడు రూ.350 కోట్లు, వైఎస్ఆర్ వాహన మిత్ర రూ.275 కోట్లు, మైనార్టీల సంక్షేమం రూ.4,203 కోట్లు, మన బడి నాడు నేడు రూ.3,500 కోట్లు, పేదలందరికీ ఇళ్లు రూ.5,600 కోట్లు, పరిశ్రమలు, వాణిజ్యం రూ.2,602 కోట్లు, రోడ్లు, భవనాలు శాఖ రూ.9,118 కోట్లు

YouTube video

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది