Ap Cabinet Meeting : ఏపీ కేబినెట్‌లో చ‌ర్చించిన కీల‌క అంశాలు ఇవే | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ap Cabinet Meeting : ఏపీ కేబినెట్‌లో చ‌ర్చించిన కీల‌క అంశాలు ఇవే

Ap Cabinet Meeting : ప్రస్తుతం కరోనా ఎక్కడ చూసినా తీవ్రంగా విజృంభిస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నియంత్రణ కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదు. ఏపీలో ఇప్పటికే రాత్రి పూట కర్ఫ్యూను విధించారు. రాత్రి 10 నుంచి ఉదయం 5 వరకు ప్రస్తుతం కర్ఫ్యూ అమలులో ఉండగా.. తాజాగా ఏపీ కేబినేట్ మరో నిర్ణయం తీసుకుంది. బుధవారం (మే 5) నుంచి పగటి పూట కర్ఫ్యూను విధించనుంది. ఏపీ సీఎం వైఎస్ […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :4 May 2021,6:42 pm

Ap Cabinet Meeting : ప్రస్తుతం కరోనా ఎక్కడ చూసినా తీవ్రంగా విజృంభిస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నియంత్రణ కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదు. ఏపీలో ఇప్పటికే రాత్రి పూట కర్ఫ్యూను విధించారు. రాత్రి 10 నుంచి ఉదయం 5 వరకు ప్రస్తుతం కర్ఫ్యూ అమలులో ఉండగా.. తాజాగా ఏపీ కేబినేట్ మరో నిర్ణయం తీసుకుంది. బుధవారం (మే 5) నుంచి పగటి పూట కర్ఫ్యూను విధించనుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో ఏపీ కేబినేటీ భేటీ జరగగా… ఈ భేటీలో మంత్రివర్గం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా నియంత్రణ కోసం, కర్ఫ్యూ గురించి, ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ గురించి, రైతుల గురించి, ఇతర సంక్షేమ పథకాల విషయంలో మంత్రివర్గం కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత మంత్రి పేర్ని నాని.. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు.

ap cabinet meeting and prime decisions

ap cabinet meeting and prime decisions

మే 5 నుంచి పగటి పూట కర్ఫ్యూ అమలులోకి రానుంది. పగటిపూట కర్ఫ్యూలో భాగంగా ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే షాపులకు అనుమతి ఉంటుంది. మధ్యాహ్నం 12 దాటాక ఏపీలోని అన్ని షాపులు బంద్ చేయాల్సి ఉంటుంది. 12 తర్వాత షాపులు మాత్రమే కాదు.. ప్రజా రవాణా, ఇతర వాహనాలు కూడా రోడ్డు మీద తిరగడానికి వీలు లేదు. అంటే.. మధ్యాహ్నం 12 దాటితే బస్సులు తిరగవు. ప్రైవేటు వాహనాలు కూడా తిరగవు.. అని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు.

ఏపీ కేబినేట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే

మధ్యాహ్నం 12 తర్వాత అంతరాష్ట్ర సర్వీసులను కూడా రద్దు చేశారు. పగటి పూట కర్ఫ్యూ వల్ల రాష్ట్రంలో కేసులు గణనీయంగా తగ్గుతాయని.. అలా అయితేనే కరోనాను నియంత్రించడం కుదురుతుందని మంత్రి పేర్ని నాని తెలిపారు. రైతులకు సంబంధించి… మే 13న రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాల్లో నగదును జమ చేయనున్నారు. దీని వల్ల సుమారు 54 లక్షల రైతులకు లబ్ధి చేకూరనుంది. మే 25న వైఎస్సార్ ఉచిత పంటల బీమా నగదును ప్రభుత్వం జమ చేయనుంది. దీని వల్ల సుమారు 38 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.

ప్రస్తుతం మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరు కాబట్టి… వాళ్ల కోసం మే 18న వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం కింద… నగదు జమ చేయనుంది ప్రభుత్వం. ఈ పథకంలో భాగంగా… వేటకు వెళ్లే మత్స్యకారులకు 10 వేల రూపాయల సాయాన్ని అందించనుంది ప్రభుత్వం. పట్టా రైతులకు భూసేకరణ పరిహారం ఇచ్చినట్టుగానే… అసైన్డ్ భూమి కలిగిన రైతులకు కూడా సమానంగా భూసేకరణ పరిహారాన్ని ప్రభుత్వం అందించనుంది.

ప్రభుత్వ పాఠశాలల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 7వ తరగతి నుంచి ఏపీలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్ ను బోధించనున్నారు. సీబీఎస్ఈ సిలబస్ కు కేబినేట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఉన్న 44639 ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే సంవత్సరం నుంచి సీబీఎస్ఈ సిలబస్ ను బోధించనున్నారు. అలాగే పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలో సీబీఎస్ఈ బోధన ఉండనుంది. ఇప్పటికే ఏపీలో నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారాయని… ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య కూడా పెరిగిందని మంత్రి పేర్ని నాని తెలిపారు.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది