Ap Cabinet Meeting : ప్రస్తుతం కరోనా ఎక్కడ చూసినా తీవ్రంగా విజృంభిస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నియంత్రణ కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదు. ఏపీలో ఇప్పటికే రాత్రి పూట కర్ఫ్యూను విధించారు. రాత్రి 10 నుంచి ఉదయం 5 వరకు ప్రస్తుతం కర్ఫ్యూ అమలులో ఉండగా.. తాజాగా ఏపీ కేబినేట్ మరో నిర్ణయం తీసుకుంది. బుధవారం (మే 5) నుంచి పగటి పూట కర్ఫ్యూను విధించనుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో ఏపీ కేబినేటీ భేటీ జరగగా… ఈ భేటీలో మంత్రివర్గం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా నియంత్రణ కోసం, కర్ఫ్యూ గురించి, ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ గురించి, రైతుల గురించి, ఇతర సంక్షేమ పథకాల విషయంలో మంత్రివర్గం కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత మంత్రి పేర్ని నాని.. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు.
మే 5 నుంచి పగటి పూట కర్ఫ్యూ అమలులోకి రానుంది. పగటిపూట కర్ఫ్యూలో భాగంగా ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే షాపులకు అనుమతి ఉంటుంది. మధ్యాహ్నం 12 దాటాక ఏపీలోని అన్ని షాపులు బంద్ చేయాల్సి ఉంటుంది. 12 తర్వాత షాపులు మాత్రమే కాదు.. ప్రజా రవాణా, ఇతర వాహనాలు కూడా రోడ్డు మీద తిరగడానికి వీలు లేదు. అంటే.. మధ్యాహ్నం 12 దాటితే బస్సులు తిరగవు. ప్రైవేటు వాహనాలు కూడా తిరగవు.. అని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు.
మధ్యాహ్నం 12 తర్వాత అంతరాష్ట్ర సర్వీసులను కూడా రద్దు చేశారు. పగటి పూట కర్ఫ్యూ వల్ల రాష్ట్రంలో కేసులు గణనీయంగా తగ్గుతాయని.. అలా అయితేనే కరోనాను నియంత్రించడం కుదురుతుందని మంత్రి పేర్ని నాని తెలిపారు. రైతులకు సంబంధించి… మే 13న రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాల్లో నగదును జమ చేయనున్నారు. దీని వల్ల సుమారు 54 లక్షల రైతులకు లబ్ధి చేకూరనుంది. మే 25న వైఎస్సార్ ఉచిత పంటల బీమా నగదును ప్రభుత్వం జమ చేయనుంది. దీని వల్ల సుమారు 38 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.
ప్రస్తుతం మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరు కాబట్టి… వాళ్ల కోసం మే 18న వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం కింద… నగదు జమ చేయనుంది ప్రభుత్వం. ఈ పథకంలో భాగంగా… వేటకు వెళ్లే మత్స్యకారులకు 10 వేల రూపాయల సాయాన్ని అందించనుంది ప్రభుత్వం. పట్టా రైతులకు భూసేకరణ పరిహారం ఇచ్చినట్టుగానే… అసైన్డ్ భూమి కలిగిన రైతులకు కూడా సమానంగా భూసేకరణ పరిహారాన్ని ప్రభుత్వం అందించనుంది.
ప్రభుత్వ పాఠశాలల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 7వ తరగతి నుంచి ఏపీలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్ ను బోధించనున్నారు. సీబీఎస్ఈ సిలబస్ కు కేబినేట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఉన్న 44639 ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే సంవత్సరం నుంచి సీబీఎస్ఈ సిలబస్ ను బోధించనున్నారు. అలాగే పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలో సీబీఎస్ఈ బోధన ఉండనుంది. ఇప్పటికే ఏపీలో నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారాయని… ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య కూడా పెరిగిందని మంత్రి పేర్ని నాని తెలిపారు.
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.