Nimmagadda: ‘ఒప్పుకోనంటే ఒప్పుకోనంతే’ కుండబద్దలు కొట్టేసిన నిమ్మగడ్డ?
ఏపీ పంచాయతీ ఎన్నికలపై మరోసారి ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ గరం అయ్యారు. పంచాయతీ ఎన్నికల విషయంలో రాజ్యాంగం ఏది చెబితే.. తాము అది చేస్తాం.. అంటూ ఆయన కుండబద్దలు కొట్టారు. తాజాగా పంచాయతీ ఎనికల నిర్వహణపై వైజాగ్ జిల్లా అధికారులతో నిమ్మగడ్డ సమీక్ష నిర్వహించారు.
ఈసందర్భంగా మాట్లాడిన నిమ్మగడ్డ… పోలింగ్ అధికారులకు పోలింగ్ విధానాన్ని వివరించారు. వైజాగ్ జిల్లా వ్యాప్తంగా సుమారు 20 వేల మంది సిబ్బంది పోలింగ్ విధుల్లో పాల్గొంటారని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలోని ప్రతి రెవెన్యూ డివిజన్ లో శిక్షణ కార్యక్రమాలు చేపట్టామని నిమ్మగడ్డ స్పష్టం చేశారు.
ఏకగ్రీవాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన నిమ్మగడ్డ
ఏకగ్రీవాలపై కూడా ఎన్నికల కమిషనర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏకగ్రీవాలకు తాము వ్యతిరేకం కాదని.. కాకపోతే ఏకగ్రీవాలు పూర్తిగా పారదర్శకంగా జరగాలని ఆయన అన్నారు. అప్పుడే ఎటువంటి ఇబ్బందులు ఉండవన్నారు. అభ్యర్థులు కూడా పోటీల్లో స్వతంత్రంగా, స్వేచ్ఛగా పాల్గొనేలా అధికారులు చర్యలు తీసుకోవాలంటూ నిమ్మగడ్డ ఆదేశించారు. ఏకగ్రీవాల పరిశీలన కోసం నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశామని తెలిపిన నిమ్మగడ్డ.. రాజ్యాంగం ప్రకారం.. రాజ్యాంగంలో ఏది ఉంటే.. దాన్నే ఎన్నికల కమిషన్ ఫాలో అవుతుందని.. ఆయన స్పష్టం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికలే కదా.. అని అధికారులు నిర్లక్ష్యం చేయొద్దని.. ఎన్నికల అధికారులు విధిగా ఎన్నికల నిర్వహణకు సహకరించాలని నిమ్మగడ్డ స్పష్టం చేశారు. అలాగే మీడియా కూడా ఎన్నికలకు సహకరించాలని… ఓటింగ్ శాతం పెరిగేలా అధికారులు, మీడియా అందరూ కృషి చేయాలని స్పష్టం చేశారు.