బిగ్ బ్రేకింగ్: ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టు.. విజయవాడకు తరలింపు..
mp raghurama krishnaraju ఏపీలో రాజకీయాలు మరింతగా వేడెక్కాయి. అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు mp raghurama krishnaraju ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వస్తున్న విషయం విదితమే. అయితే ఆయనను శుక్రవారం ఏపీ సీఐడీ అధికారులు అరెస్టు చేయడం సంచలనం సృష్టిస్తోంది. హైదరాబాద్‌లో ఉన్న ఆయన వద్దకు ఏపీ సీఐడీ అధికారులు చేరుకుని నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఆయన నోటీసులను తిరస్కరించారు. దీంతో అధికారులు ఆయన ఇంటికి నోటీసులను అతికించారు. తరువాత ఆయనను అరెస్టు చేశారు.

ap cid arrested mp raghuramaap cid arrested mp raghurama krishnaraju krishnaraju
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును mp raghurama krishnaraju ఏపీ సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. ఆయనపై వారు 124ఎ, 153ఎ, 505 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ ప్రతిష్టకు ఆయన భంగం కలిగించారని, అందుకనే ఆయనపై ఆయా సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి నోటీసులు అందజేసి అరెస్టు చేశామని తెలిపారు. ఆయన భార్య రమాదేవి పేరిట నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో రఘురామ కృష్ణరాజును ఏపీ సీఐడీ అధికారులు విజయవాడకు తరలిస్తున్నారు.
కాగా రఘురామకృష్ణరాజు mp raghurama krishnaraju అరెస్టుపై ఆయన కుమారుడు భరత్ స్పందించారు. ఈ రోజు నాన్న పుట్టిన రోజు, పుట్టిన రోజు నాడే ఆయనను అరెస్టు చేశారు, ఆయనకు 3 నెలల కిందట గుండెకు ఆపరేషన్ అయింది, మఫ్టీలో వచ్చింది సీఐడీ వారా, రౌడీలా తెలియడం లేదు, ముందస్తు ప్రణాళిక ప్రకారమే అకస్మాత్తుగా వచ్చి నాన్నను అరెస్టు చేశారు, వై కేటగిరి భద్రత ఉంది, అయినప్పటికీ ఆయనను బలవంతంగా లాక్కెళ్లారు.. అని భరత్ ఆరోపించారు.
నాన్ను అరెస్టు చేసే సందర్భంలో న్యాయవాదితో మాట్లాడేందుకు కూడా అధికారులు అవకాశం ఇవ్వలేదు, వేరే రాష్ట్రంలో ఉన్న ఎంపీని ఎలా అరెస్టు చేస్తారు, ప్రభుత్వం తప్పులు చేస్తోంది, వాటిని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా ? నాన్నను ఎక్కడికి తరలిస్తున్నారో తెలియదు, దీనిపై న్యాయ పోరాటం చేస్తాం.. అని భరత్ అన్నారు.