YS Jagan : జగన్ సంచలన ఆదేశాలు.. హుటాహుటిన బయలుదేరిన అధికారులు..!
YS Jagan : ఏపీలో వచ్చే సంవత్సరం ఎన్నికలు జరగనున్నాయి. ఈనేపథ్యంలో సీఎం జగన్ ఇప్పటి నుంచే ఎన్నికలకు సమాయత్తం అవుతున్నారు. పలు అంశాలపై దృష్టి పెట్టారు. వచ్చే ఎన్నికల్లోకా పలు అంశాలను క్లియర్ చేయాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే భూసర్వే నిర్వహించాలని సీఎం జగన్ యోచిస్తున్నారు. భూసర్వే భవిష్యత్తు తరాల వారికి ఉపయోగకరంగా ఉంటుందని.. అందుకే సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. అలాగే.. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకాలపై సీఎం జగన్ తాజాగా సమీక్ష నిర్వహించారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పథకానికి తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, ప్రజలకు అత్యంత ఉపయోగకరమైన కార్యక్రమం ఇది అని సీఎం జగన్ చెప్పుకొచ్చారు. అసలు ఇలాంటి భూసర్వేను ఏ రాష్ట్రంలోనూ చేపట్టలేదని సీఎం జగన్ చెప్పుకొచ్చారు. అలాగే.. బెస్ట్ టెక్నాలజీతో ఎవరూ టాంపర్ చేయలేని విధంగా సర్టిఫికెట్లు ఇస్తున్నామని, మే 20 తేదీ వరకు సర్వే రాళ్లు కూడా వేస్తామని, సర్వే ప్రక్రియను పూర్తి త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. తొలి దశలో భాగంగా 2 వేల గ్రామాల్లో సర్వే ప్రక్రియ జరగనుంది.
YS Jagan : తొలి దశలో 2 వేల గ్రామాల్లో సర్వే ప్రక్రియ
దీని కోసం ప్రతి గ్రామ సచివాలయంలో సర్వే కోసం పరికరాలు ఉండాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. రోజుకు 50 వేల సర్వే రాళ్ల చొప్పున సరఫరా చేసేలా ప్రణాళిక వేశాం. రాళ్ల కొరత లేకుండా చూస్తున్నాం. రోవర్ తరహా పరికరాలు తప్పకుండా ఉండేలా చూసుకుంటున్నాం. సర్వేయర్ పని పూర్తి కాగానే నిర్దేశించుకున్న సమయంలో సర్వే పూర్తి చేసేలా ప్రణాళికలు రచిస్తున్నామని అధికారులు సీఎంకు చెప్పుకొచ్చారు. ఈ నెలలో సుమారు 300 గ్రామాల్లో సర్వే ప్రక్రియ పూర్తవుతుందన్నారు. ఈ డిసెంబర్ లోగా అన్ని గ్రామాల్లో సర్వేను పూర్తి చేసే దిశగా లక్ష్యాలను పెట్టుకున్నట్టు అధికారులు సీఎం జగన్ కు తెలిపారు.