YS Jagan : వైఎస్ జగన్ కు ప్రజాదరణ పెరిగిందా? తగ్గిందా? ఎంత మంది ఏపీ ప్రజలు జగన్ కు ప్రస్తుతం మద్దతుగా నిలిచారు?
YS Jagan : రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరిగేది ఎవ్వరూ ఊహించలేరు. అన్ని విషయాలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. అందుకే రాజకీయ నాయకులు కూడా ప్రతినిత్యం తమను తాము మార్చుకుంటూ ప్రజల నాడిని తెలుసుకొని దానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తుంటారు. మరోవైపు రాజకీయ నాయకుల, పార్టీల భవితవ్యం ఎలా ఉండబోతోందో చెప్పేందుకు చాలా సర్వేలను నిర్వహిస్తూ ఉంటారు. తాజాగా జాతీయ మీడియా సంస్థలు కొన్ని ఏపీలో నిర్వహించిన సర్వేలు ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యాయి. ఓవైపు ఏపీలో పచ్చ మీడియా ఏపీ సీఎం జగన్ పై లేనిపోనివి రాస్తూ, ప్రాంతీయంగా సీఎం జగన్ ను బ్యాడ్ చేసేందుకు అవి చేయని ప్రయత్నాలు ఉండవు. కానీ.. నేషనల్ మీడియాలో ఎంతో పేరున్న ఇండియా టుడే, ఇండియా టీవీలు నిర్వహించిన సర్వేల ఫలితాలు చూస్తే మాత్రం అందరూ ఆశ్చర్యపోవాల్సిందే.
YS Jagan : జగన్ ను సీఎంగా 57 శాతం మంది ఏపీ ప్రజలు కోరుకుంటున్నారట
ఇటీవల ఇండియా టుడే నిర్వహించిన సర్వే ప్రకారం, ఏపీ సీఎంగా జగన్ ను 57 శాతం మంది ప్రజలు కోరుకుంటున్నారట. 2019 లో 50 శాతం మంది ప్రజలు మాత్రమే జగన్ ను సీఎంగా కావాలనుకున్నారు. కానీ.. కేవలం మూడేళ్లలోనే జగన్ కు ప్రజాదరణ పెరిగింది కానీ తగ్గలేదు. ఏపీలో ఇప్పటి వరకు ఏ సీఎం ప్రవేశపెట్టని పథకాలను వైఎస్ జగన్ ప్రవేశపెట్టారు. ముఖ్యంగా సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్ల చాలామంది లబ్ధి పొందారు. ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా సంక్షేమ పథకాలను సీఎం జగన్ ప్రారంభించారు. ఆ పథకాలే సీఎం జగన్ ను ఉన్నత స్థానానికి తీసుకెళ్లాయి. ఏపీలోని సంక్షేమాభివృద్ధి పథకాలు, సామాజిక న్యాయాన్ని ప్రజలు ఆదరిస్తున్నారని సర్వేలోనూ ప్రస్తావించింది ఇండియా టుడే.
ఈ సర్వేలో వైసీపీ ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పిన ఇండియా టుడే.. రెండో స్థానంలో టీడీపీ నిలుస్తుందని తెలిపింది. బీజేపీ హవా ఏపీలో అంతగా లేదని తెలిపింది. జనసేన గురించి అయితే సర్వేలో ప్రస్తావనే లేదు. వైసీపీ 18 ఎంపీ స్థానాల్లో గెలవనుందట. టీడీపీ మాత్రం కేవలం 7 స్థానాల్లో మాత్రమే గెలుస్తుందట. అంతే కాదు.. అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో సీఎం జగన్ ఐదో స్థానంలో నిలిచారు. మొదటి స్థానంలో యూపీ సీఎం ఆదిత్యనాథ్ నిలవగా.. రెండో స్థానంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిలిచారు. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మూడో స్థానంలో నిలిచారు. తమిళనాడు సీఎం స్టాలిన్ నాలుగో స్థానంలో నిలవగా.. ఐదో స్థానంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ నిలిచారు.