Farmers | రైతులకు విజ్ఞప్తి .. సెప్టెంబర్ 30 చివరి తేది… తక్షణమే ఈ-క్రాప్ నమోదు చేయండి!
Farmers | ఆంధ్రప్రదేశ్ రైతులకు ఒక కీలకమైన హెచ్చరిక. ఈ-క్రాప్ బుకింగ్‌కు సెప్టెంబర్ 30 (రేపు) చివరి తేదీగా వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. కేవలం ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉండటంతో, రైతులు తమ పంటలను వెంటనే నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఆలస్యమైతే రైతులు ప్రభుత్వ పథకాల లబ్ధి నుండి దూరమయ్యే అవకాశం ఉంది.

#image_title
ఈ-క్రాప్ ఎందుకు అవసరం?
రైతుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ, పంట బీమా, వాతావరణ బీమా వంటి పథకాల లబ్ధిని పొందాలంటే ఈ-క్రాప్ నమోదు తప్పనిసరి. పంట నష్టపోతే బీమా సాయం, పెట్టుబడి సబ్సిడీలు, నష్ట పరిహారాలు ఇలా అనేక రకాలుగా ఈ సమాచారం ఉపయోగపడుతుంది.
నమోదు చేయాల్సిన డాక్యుమెంట్లు:
ఆధార్ కార్డు
మొబైల్ నంబర్
పంట వివరాలు (ఎలా పండిస్తున్నారు, ఎన్ని ఎకరాల్లో వేశారు మొదలైనవి)
ఎవరి దగ్గర నమోదు చేయాలి?
వ్యవసాయ పంటలు – మండల వ్యవసాయ అధికారి
ఉద్యాన పంటలు – హార్టికల్చర్ అధికారి
సర్కార్ భూములు / ఇతర క్లెయిమ్‌లపై – తహసీల్దార్
ఈ-క్రాప్ KYC కూడా తప్పనిసరి
రైతులు తమ ఆధార్ వివరాలతో ఈ-క్రాప్ KYC పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇది పూర్తయిన తర్వాతే పంటలు ప్రభుత్వ పథకాల అర్హతకు వస్తాయి. ముఖ్యంగా వర్షాభావం, భారీ వర్షాలు, తుపానులు వంటి ప్రకృతి అపాయాల సమయంలో ప్రభుత్వం అందించే బీమా సహాయం కోసం ఇది అత్యంత అవసరం.