AP Welfare Schemes : ఏపీ విద్య విధానం భేష్.. మెచ్చుకున్న స్విట్జర్లాండ్ ప్రెసిడెంట్.. వైఎస్ జగన్‌కి ప్రశంస
AP Welfare Schemes : ఏపీలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో లేవు. ఇంకా చెప్పాలంటే ఏ దేశంలో కూడా లేవు. అవును.. బడుగు, బలహీన వర్గాలు, చిరు వ్యాపారులు, విద్యార్థుల కోసం ఏపీ సీఎం వైఎస్ జగన్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు. ఆ పథకాలు ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో కూడా అమలు కావడం లేదు. అయితే.. సీఎం జగన్ ప్రవేశపెట్టిన పథకాలకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఏపీ పథకాలకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. ఏకంగా స్విట్జర్లాండ్ ప్రెసిడెంట్ ఏపీ పథకాలను మెచ్చుకున్నారు. ఏపీలో ఉన్న విద్యా విధానం భేష్ అంటూ అభినందించారు. ఏపీ విద్యా విధానంలో భాగంగా తీసుకొచ్చిన నాడు నేడు పథకాన్ని కూడా ఆయన మెచ్చుకున్నారు.
AP Welfare Schemes : జెనీవాలో జరిగిన ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ ఫోరం ఎడ్యుకేషన్ ఫర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్
స్విస్ లోని జెనీవాలో ఉన్న యూఎన్ లో ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ ఫోరం ఎడ్యుకేషన్ ఫర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్విట్జర్లాండ్ ప్రెసిడెంట్ హాజరయ్యారు. అలాగే భారత్ నుంచి ఐక్యరాజ్యసమితి స్పెషల్ కన్సల్టేటివ్ స్టాటస్ మెంబర్ వున్నావ శేకిన్ కుమార్ హాజరయ్యారు. ఆయన తెలుగు వ్యక్తి. ఆయన ఏపీలో ప్రవేశపెట్టిన నాడు నేడు పథకం గురించి, విద్యార్థుల కోసం సీఎం జగన్ ప్రవేశపెట్టిన ఇతర పథకాలను స్విస్ అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆ పథకాలను స్విస్ అధ్యక్షులు మెచ్చుకున్నారు. రాష్ట్రం కానీ.. దేశం కానీ.. అభివృద్ధి సాధించాలంటే ఖచ్చితంగా
అక్కడి విద్యా విధానం బాగుండాలని ఏపీలో విద్యా విధానం బాగుందని వాళ్లు అభినందనలు తెలియజేశారు. ఈ సమావేశం ఫిబ్రవరి 15,16 తేదీల్లో జెనీవాలోని యూఎన్ కార్యాలయంలో జరిగింది. అలాగే.. త్వరలో జరగబోయే ఎస్డీసీ సమ్మిట్ హై లేవల్ పొలిటికల్ ఫోరమ్ లో ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన నవరత్నాలు పథకాల గురించి వివరిస్తానని వున్నావ శేకిన్ కుమార్ చెప్పుకొచ్చారు. ఆ సమ్మిట్ కు ప్రపంచ నేతలు, దేశాధ్యక్షులు, ఐక్యరాజ్యసమితిలో భాగమైన దేశాల నేతలు రానున్నారు. ఏపీలో నవరత్నాల పథకం ద్వారా ప్రజల్లో, రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి చోటు చేసుకుందో స్పష్టంగా ఆ సమ్మిట్ లో వివరిస్తానని ఆయన స్పష్టం చేశారు.