AP RTC Employees : ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఎగిరి గంతేసే శుభవార్త
AP RTC Employees : ఏపీ ప్రభుత్వం ఏపీఎస్సార్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం జగన్ తీపి కబురు అందించారు. ప్రజా రవాణా శాఖ కిందికి ప్రస్తుతం ఏపీఎస్సార్టీసీ వస్తున్నందున.. ఇప్పటికే ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిజానికి ఉద్యోగులకు పదోన్నతులను కల్పించినా ఇంకా పీఆర్సీ అమలు చేయలేదు. తాజాగా వారికి పీఆర్సీని అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
పదోన్నతి పొందిన 2096 మంది ఉద్యోగులకు పీఆర్సీని అమలు చేయనున్నారు. నిజానికి.. 2020 నుంచి పీటీడీలో ఆర్టీసీ ఉద్యోగులు విలీనం అయ్యారు. ప్రజా రవాణా శాఖలో 51,488 ఉద్యోగులను చేర్చారు. అందులో 2096 ఉంది ఆర్టీసీ ఉద్యోగులకు ఆర్టీసీ యాజమాన్యం పదోన్నతులు కల్పించింది. కొత్త పీఆర్సీ ప్రకారం మార్చి 1 నుంచి వీళ్లకు వేతనాలు అందనున్నాయి.
AP RTC Employees : నూతన పీఆర్సీ ప్రకారం వేతనాలు అందనుండటంతో ఉద్యోగుల సంబరాలు
పదోన్నతి పొందినప్పటి నుంచి రావాల్సిన బకాయిలు కూడా నూతన పీఆర్సీ ప్రకారమే ఉద్యోగులకు అందనున్నాయి. దీంతో నూతన పీఆర్సీ ప్రకారం వేతనాలు అందే ఉద్యోగులు సంబరాలు చేసుకుంటున్నారు. పదోన్నతి ఇచ్చి ఆ తర్వాత పీఆర్సీని అమలు చేసినందుకు సీఎం జగన్ కి ఆర్టీసీ ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు.