Ap govt : ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది.
Ap govt : ఉద్యోగులకు ఇవ్వాల్సిన హెచ్‌ఆర్‌ఏలో భారీ కోత విధించనున్నట్లు తెలిపి.. ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లింది. ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాలతో ఆంధ్రప్రదేశ్ సీఏం జగన్ ఇటీవల చర్చలు జరిపారు. చర్చలు సఫలీకృతమయి ఈ నెల రెండో వారంలోనే పెరిగిన వేతనాలు చేతికి అందుతాయని అంతా ఎదురు చూశారు. అయితే తాజాగా ఆయా ఉద్యోగుల ఆశలను అడియాశాలు చేస్తూ, ప్రభుత్వం
సచివాలయం, హెచ్‌వోడీ ఆఫీస్ ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏ 30 శాతం నుంచి 16 శాతానికి కోత విధించింది. భంగపాటు కలిగించింది. ప్రభుత్వం కోత విధించింది. గుంటూరు, విశాఖ, నెల్లూరు, విజయవాడ, వెలగపూడి సచివాలయ ఉద్యోగులకు మూలవేతనంలో 16 శాతం హెచ్‌ఆర్‌ఏ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని మిగతా అన్ని ప్రాంతాలకు 8 శాతం హెచ్‌ఆర్‌ఏ ప్రకటించింది. ఈ ప్రకటనపై ఆయా ప్రాంతాల ప్రభుత్వ ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Ap govt declaire that they decrease hra of state govt employees
హెచ్ ఆర్ ఏ, సీసీఏ తో పాటు మరోవైపు 70, 75 సంవత్సరాల రిటైర్డ్ ఉద్యోగుల పెన్షనర్లకు ఇచ్చే అదనపు పింఛనుకు సంబంధించి ప్రభుత్వంతో చర్చలు నడుస్తుండగానే.. నేడు ఈ నిర్ణయం రావడం ఉద్యోగుల్లో మరింత నిరాశను తెచ్చింది. మరోవైపు ఉద్యోగసంఘాలు ఏపీ ప్రభుత్వ ప్రకటనను తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్త నిరసనకు పిలుపునిచ్చాయి.