Amaravati Farmers : అమరావతి రైతులకు పండగ లాంటి వార్త..!
Amaravati Farmers : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజధాని అమరావతి ( Amaravati ) నిర్మాణం శరవేగంగా జరుగుతున్న వేళ.. భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం మరో భారీ శుభవార్త వినిపించింది. రాజధాని కోసం భూములిచ్చిన రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా సీఆర్డీఏ ( CRDA ) కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా రైతులను ఎప్పటి నుంచో వేధిస్తున్న ‘వీధి పోట్ల’ (Veedhi Potlu) సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపింది.
Amaravati Farmers : అమరావతి రైతులకు పండగ లాంటి వార్త..!
Amaravati Farmers : వీధి పోట్ల ప్లాట్ల మార్పుకు గ్రీన్ సిగ్నల్
రాజధానిలో ల్యాండ్ పూలింగ్ కింద రైతులకు కేటాయించిన ప్లాట్లలో కొన్నింటికి వాస్తు రీత్యా వీధి పోట్లు ఉండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఒక త్రిసభ్య కమిటీని నియమించింది. ఈ కమిటీ ఇచ్చిన సూచనల మేరకు, వీధి పోట్లు ఉన్న ప్లాట్లను మార్చుకునేందుకు ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అధికారులు గుర్తించిన వివరాల ప్రకారం.. ఇంకా రిజిస్ట్రేషన్ ( Registration ), మ్యూటేషన్ జరగని సుమారు 112 ప్లాట్లకు ఈ వీధి పోట్ల సమస్య ఉన్నట్లు తేలింది. వీరికి ఈ ప్లాట్ల బదులుగా, వేరే ప్రాంతంలో వాస్తు దోషం లేని మంచి ప్లాట్లను కేటాయించనున్నారు. ఇప్పటికే ఉండవల్లి గ్రామానికి చెందిన 16 మంది రైతులకు సంబంధించి 21 రిటర్నబుల్ ప్లాట్లను రీ-లొకేట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Amaravati Farmers : ఉచిత రిజిస్ట్రేషన్.. ఈ-లాటరీ ద్వారా కేటాయింపు
రైతులకు కేటాయించే ప్లాట్ల ప్రక్రియలో పారదర్శకత కోసం సీఆర్డీఏ అధికారులు ‘ఈ-లాటరీ’ ( E-Lottery ) విధానాన్ని అమలు చేస్తున్నారు. ఆన్‌లైన్ ర్యాండమ్ సిస్టమ్ ద్వారా నివాస, వాణిజ్య ప్లాట్లను కేటాయిస్తున్నారు. ఉండవల్లి గ్రామానికి చెందిన 195 మంది రైతులకు 381 ప్లాట్లను కేటాయించారు. ప్లాట్లు పొందిన రైతులు రిజిస్ట్రేషన్ కోసం ఎలాంటి రుసుము (Fees) చెల్లించాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. రిటర్నబుల్ ప్లాట్లు పొందిన రైతులు వెంటనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.
Amaravati Farmers : గ్రామాల్లో మళ్లీ సందడి.. కొనసాగుతున్న గ్రామ సభలు
రాజధాని పనులు ఊపందుకోవడంతో అమరావతి గ్రామాల్లో మళ్లీ సందడి నెలకొంది. అభివృద్ధి పనులపై చర్చించేందుకు ఉద్దండరాయునిపాలెం, వెలగపూడి, వెంకటపాలెం తదితర గ్రామాల్లో అధికారులు గ్రామసభలు నిర్వహిస్తున్నారు. రైతుల అభిప్రాయాలను తీసుకుంటూ పనులు ముందుకు తీసుకెళ్తున్నారు.
అనాథ పిల్లలకు రూ.5000 పెన్షన్
కేవలం రైతులకే కాకుండా, అమరావతి పరిధిలోని అనాథ పిల్లలకు కూడా కూటమి ప్రభుత్వం అండగా నిలిచింది. తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలను ఆదుకునేందుకు వారికి నెలకు రూ.5 వేల పెన్షన్ (Pension) ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మొత్తానికి ప్లాట్ల మార్పు, ఉచిత రిజిస్ట్రేషన్ వంటి నిర్ణయాలతో అమరావతి రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.