YS Jagan Govt : ఫుల్ ధైర్యంగా సుప్రీం కోర్టు మెట్లు ఎక్కబోతోన్న జగన్ సర్కార్ !
YS Jagan Govt : ఏపీలో ఎన్నికలు ఇంకా సంవత్సరమే సమయం ఉంది. వచ్చే సంవత్సరం ఈ టైమ్ కి ఏపీలో ఎన్నికల హడావుడే ఉంటుంది. అందుకే ప్రధాన పార్టీలన్నీ ఇప్పటి నుంచే సమాయత్తం అవుతున్నాయి. అయితే.. అంతా బాగానే ఉంది కానీ.. అధికార పార్టీని ఒకే ఒక సమస్య వేధిస్తోంది. అదే మూడు రాజధానుల అంశం. ఏపీని సీఎం జగన్ నెంబర్ వన్ చేశారు. చాలా సంక్షేమ పథకాలు అమలు చేశారు. అంతా బాగానే ఉంది కానీ.. మూడు రాజధానుల అంశం మాత్రం సుప్రీంకోర్టులో విచారణలో ఉంది.
అది తేలకపోతే ఎన్నికల్లో ప్రజలకు ఎలా ముఖం చూపించాలి అనే మీమాంశలో అధికార వైసీపీ పార్టీ ఉంది. రాజధాని అంశాన్ని త్వరగా తేల్చాలని అనుకుంటోంది. దానికి కారణం.. త్వరలో వైజాగ్ నుంచి పాలన ప్రారంభించాలనేది కోరిక. చంద్రబాబు హయాంలో అమరావతిని రాజధానిగా ప్రకటించిన విషయం తెలిసిందే. దాన్ని కాదని.. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులను ఏర్పాటు చేసింది. ఏపీ హైకోర్ట్ కూడా అమరావతికే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సుప్రీంకోర్టు తలుపు తట్టింది ఏపీ ప్రభుత్వం.
YS Jagan Govt : అమరావతి కేసు విచారణ వేగవంతం చేయండి
కానీ.. ఆ కేసు సుప్రీంలో ఇంకా విచారణ దశలోనే ఉంది. మరోవైపు ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎన్నికలు వచ్చేలోపు అమరావతి కేసును ఎలాగైనా ఓ కొలిక్కి తీసుకురావాలని.. అలా అయితే ప్రజలు తమను నమ్మి ఓటేస్తారని వైసీపీ భావిస్తోంది. అందుకే.. మరోసారి సుప్రీంలో విచారణ వేగవంతం చేయాలని ఏపీ ప్రభుత్వం కోరింది. దీంతో ఈనెల 28 న విచారణ ఉంటుందని సుప్రీం ధర్మాసనం నిర్ణయించింది. సుప్రీంలో విచారణ పూర్తయితే తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. అందుకే త్వరగా విచారణ పూర్తి అయ్యేలా చేయాలని భావిస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.